మాస్ మహారాజ రవితేజ కెరియర్ లో ఇప్పటివరకు ఎప్పుడు ఎదుర్కొని ఒక విచిత్రమైన సంక్లిష్ట పరిస్థితులలో రవితేజ ఇరుక్కున్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మహారాజ కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు అన్న విషయం ఓపెన్ సీక్రెట్. 'బలుపు' మూవీ మినహాయిస్తే గత ఐదారేళ్లలో రవితేజకు చెప్పుకోతగ్గ ఒక్క హిట్ కూడ లేదు. 

హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా ఎడాదిడికి కనీసం మూడు సినిమాలు చేసే రవితేజ కెరీర్లో ఎప్పుడు లేనంత లాంగ్ గ్యాప్ వచ్చేసింది. దాదాపు రెండేళ్ల పాటు రవితేజ సినిమా రిలీజే లేకపోవడంతో సినిమా ప్రేక్షకులతో డిస్కనెక్ట్ అయిపోయి అతడి ఫాలోయింగ్ పూర్తిగా దెబ్బతినింది. దీనికితోడు ఇలాంటి సమయంలో  అతడి వ్యక్తిగత జీవితంలో వరుసపెట్టి వస్తున్న  వివాదాలు అతణ్ని మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని అతడి సన్నిహితులు కలవర పడుతున్నట్లు సమాచారం. 

ఇప్పటికే తన తమ్ముడు భరత్ చనిపోతే కడసారి చూపుకు కూడా వెళ్లకపోవడం అంత్యక్రియలకు కూడా హాజరుకాకపోవడం పై రవితేజ తీవ్రవిమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనిపై అతను ఎంత వివరణ ఇచ్చుకున్నా అది కన్విన్సింగ్‌గా అనిపించలేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనికితోడు ఇప్పుడు డ్రగ్స్ రాకెట్లో రవితేజ కూడా పాత్రధారి అని అతడికి పోలీసులు నోటీసులు ఇచ్చారని సమాచారం బయటికి రావడంతో ఇప్పుడు డ్రగ్స్ కుంభకోణం అతడి మెడకు చుట్టుకుంది. దీనిపై ప్రస్తుతం రవితేజ వివరణ ఇచ్చే పరిస్థితుల్లో కూడా కనిపించలేదు. మీడియా ముందుకొస్తే వారు అడుగే ప్రశ్నలతో ఇబ్బంది పడాల్సి వస్తుందని మాస్ రాజా సైలెంటుగా ఉంటున్నాడట. 

అయితే ఏదో ఒక క్లారిటీ మీడియా ద్వారా ఇవ్వక పోతే తన ఇమేజ్ మరింత దెబ్బ తింటుంది అని రవితేజ భావిస్తున్నట్లు టాక్. దీనికితోడు భరత్ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిన సమయంలో అతడి ఫోన్ పరిశీలించినపుడే డ్రగ్ రాకెట్ గుట్టంతా బయటపడిందని కూడా ఓ ప్రచారం నడుస్తోంది ప్రస్తుతం. కాబట్టి రవితేజ ఇప్పుడు మీడియా ముందుకొస్తే ప్రశ్నల వర్షమే కురుస్తుంది.  అయితే తన వెర్షన్ చెప్పకుండా  ఎంత కాలం ఇలా మౌనంతో కాలంగడపాలో తెలియక రవితేజ తీవ్ర అయోమయంలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. 



                              

మరింత సమాచారం తెలుసుకోండి: