వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఎన్టీఆర్ ఇప్పుడు బుల్లితెరపైనా సందడి చేస్తున్నాడు. వరల్డ్ పాపులర్ షో బిగ్ బాస్ కు తెలుగులో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఫస్ట్ ఎపిసోడ్ లోనే అందరినీ ఆకట్టుకున్నాడు. కంటెస్టంట్లతో పోల్చితే ఎన్టీఆర్ కామెంట్రీనే బాగుందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఈ షో ఎలా ఉంటుందనే విషయాన్ని పక్కనపెడితే ఎన్టీఆర్ మాత్రం ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. వరుస హిట్లతో ఫాన్స్ ను సంబరాల్లో ముంచెత్తుతున్నాడు.

Image result for big boss ntr

ఎన్టీఆర్ ప్రస్తుతం జై లవకుశ సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత కొరటాల శివ ఓ సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నాడు. అంతేకాదండోయ్.. స్టార్ డైరెక్టర్ రాజమౌళి కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ తో ఉంటుందని సంకేతాలిచ్చాడు. దీంతో మరో రెండేళ్ల వరకూ ఎన్టీఆర్ డేట్స్ ఖాళీ లేవనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ స్వయంగా ఓ సినిమా చేయబోతున్నట్టు చెప్పాడు. అదేంటో తెలుసా..? అమ్మకు ప్రేమతో..!!

Image result for big boss ntr ahriteja

అవును.. అమ్మకు ప్రేమతో.. సినిమా చేస్తానన్నాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ కు అమ్మంటే ఎంతో ప్రేమో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్నోసార్లు అమ్మ గురించి ప్రస్తావించాడు. తానీరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం అమ్మేనని స్పష్టం చేశాడు. ఆ అమ్మకు రుణం తీర్చుకునే సమయం వస్తే తానెప్పుడూ ముందుంటానన్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ లో మరోసారి అమ్మ ప్రస్తావన వచ్చింది.


బిగ్ బాస్ లో కంటెస్టంట్స్ ను పరిచయం చేస్తున్న క్రమంలో కత్తి కార్తీక వంతు వచ్చింది. ఆ సమయంలో ఆమె నాన్నకు ప్రేమతో సినిమాను గుర్తు చేసింది. ప్రజెంట్ జనరేషన్ కు అలాంటి మూవీలు రావాల్సిన అవసరం ఉందని చెప్పింది. అమ్మపైన కూడా అలాంటి సినిమా తీయాలని కోరింది. దీంతో ఒక్కసారిగా ఉద్వేగానికి లోనైన ఎన్టీఆర్, అమ్మకు ప్రేమతో సినిమా తీస్తానని వెంటనే చెప్పేశాడు. మరో ఆలోచన లేకుండానే ఆ సినిమా చేస్తానని ప్రకటించాడు. అలా అమ్మ రుణాన్ని తీర్చుకునేందుకు సిద్ధమయ్యాడు.


మరి ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది.? ఎవరు పట్టాలెక్కిస్తారు అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. యాధృచ్చికంగా చెప్పినా.. అమ్మపైన ఎన్టీఆర్ కు ఉన్న ప్రేమాభిమానాలకోసమైనా ఆ సినిమా తీస్తాడని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఎందుకంటే అమ్మే ఎన్టీఆర్ కు ఆశ, శ్వాస.! నాన్నకు ప్రేమతో.. లాగానే అమ్మకు ప్రేమతో కూడా త్వరలోనే క్లాప్ కొట్టుకుంటుందని ఆశిద్దాం.. నాన్నను మించిన విజయం సాధించాలని కోరుకుందాం.


మరింత సమాచారం తెలుసుకోండి: