ఈ మద్య సినిమా ఇండస్ట్రీ లో సినిమాల కన్నా షార్ట్ ఫిలిమ్స్ జోరు బాగా పెరిగిపోయింది.  ఇక తెలుగు లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కొంత మంది నటీనటులు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.  అలాంటి వారిలో వైవా హర్ష ఒకరు.  తనదైన కామెడీ  మార్క్ చాటుకుంటూ వైవా హర్ష ఇప్పటి వరకు ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.

ఓ వైపు వెండితెరపై నటిస్తూనే..షార్ట్ ఫిలిమ్స్, యాంకరింగ్ చేస్తూ బిజీగా మారిపోయారు.  తాజాగా వైవా హర్ష నుంచి వ‌చ్చిన లేటెస్ట్‌ షార్ట్ ఫిల్మ్… రిలీజ‌యిన ఒక్క రోజులోనే యూట్యూబ్ లో ట్రెండింగ్ వీడియో గా కొన‌సాగుతుంది. లెట్స్ మేక్ ది ఇండియా.. ది ఇండియా వీ వాంట్ టూ సీ… అనే నినాదంతో స్వచ్ఛ్ భార‌త్ 2.0 మిష‌న్ ను ఇండియాలో తీసుకొస్తే ఎలా ఉంటుందో క‌ళ్లకు క‌ట్టిన‌ట్టు చూపించాడు వైవా హ‌ర్ష‌.   ఈసారి హర్షా భారత ప్రధాని నరేంద్ర మోడీ గా టించిన హ‌ర్ష‌… మోడీ ప్రవేశ‌పెట్టిన స్వచ్ఛ్ భార‌త్ ఉద్యమానికి కొన‌సాగింపుగా స్వచ్ఛ్ భార‌త్ 2.0 అనే మిష‌న్  అనే కొత్త కాన్సెప్ట్ తో భలే ఎంట్రటైన్ మెంట్ చేశాడు.

రోడ్డు మీద వేసిన చెత్తను సేక‌రించి… ఆ చెత్త ను ఫొరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తాడు. దాని మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ తీసుకొని ఆధార్ ఫింగ‌ర్ ప్రింట్స్ తో మ్యాచ్ చేయించి.. త‌ద్వారా ఆ చెత్త ప‌డేసిన వ్యక్తి డిటేయిల్స్ సేక‌రించి వాళ్లతో ఫైన్ క‌ట్టించ‌డ‌మే ఈ షార్ట్ ఫిలిమ్ సారాంశం.  కాస్త ఆలోచిస్తే..స్వచ్ఛ్ భార‌త్ 2.0 లో మనం చేస్తున్న పనులను బాహాటంగానే విమర్శిస్తూ తీసినట్లు ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: