ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలో డ్రగ్స్ రాకెట్ కి సంబంధించిన పలు అంశాలు ఎన్నో సంచలనాలకు నాంది పలికాయి.  ముఖ్యంగా ఈ డ్రగ్స్ కి బానిసలైన వారిలో విద్యార్థులు, ఐటి ఉద్యోగులే కాకుండా సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  ముఖ్యంగా డ్రగ్స్ అంశం టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక్క కుదుపు కుదిపేస్తుంది.  సోషల్ మీడియాలో డ్రగ్స్ కి సంబంధించి ఎప్పుడు ఏ న్యూస్ వస్తుందో నెటిజన్లు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు.  
Image result for ekkadiki pothavu chinnavada
ఈ తరుణంలో ఓ యువహీరో చంచల్ గూడ జైలుకి వెళ్లాడు. ఆ....అయితే సదరు హీరో వెళ్లింది డ్రగ్స్ కేసు విషయంలో కాదండీ బాబు..సినిమా షూటింగ్ నిమిత్తం.  నేరస్థులు అడ్డా అయిన చంచల్ గూడ జైలులో ఒక రోజంతా ఉన్నాడు యంగ్ హీరో అల్లు శిరీష్.  అసలే డ్రగ్స్ కేసులో యువ హీరోల ప్రమేయం ఉందన్న సమయంలో అల్లు శిరీష్ చంచల్ గూడ జైలుకి వెళ్లడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది.
Image result for drugs
ప్రస్తుతం అల్లు శిరీష్ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన  వి ఐ ఆనంద్ తో ఓ సినిమాలో పనిచేస్తున్నాడు. ఆ చిత్రానికి సంబంధించిన  చంచల్ గూడ జైలులో ఒకరోజు షూటింగ్ జరిగింది దాంతో ఆ రోజంతా జైలులోనే ఉండిపోయాడు అంతేకాదు షాట్ గ్యాప్ లో అక్కడి నేరస్తులకు నాలుగు మంచి మాటలు కూడా చెప్పాడు అల్లు శిరీష్.


మరింత సమాచారం తెలుసుకోండి: