భారత దేశ చరిత్రలో ఎంతో మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న ముంబాయి బాంబ్ బ్లాస్ట్ గురించి తెలియని వారు ఉండరు.  అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీం ఈ ఘోరానికి ప్రధాన సూత్రదారి.  ఈ సంఘటన తర్వాత మోస్ట్ వాంటెడ్ గా మారిన దావూద్ ప్రస్తుతం పాకిస్థాన్ లో ని కరాచిలో తలదాచుకున్నట్లు వార్తలు వచ్చాయి.  తాజాగా ముంబై మాఫియా నేప‌థ్యంలో శ్ర‌ద్ధా క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన `హ‌సీనా పార్క‌ర్` సినిమా ట్రైల‌ర్ విడుద‌లైంది.
Image result for హ‌సీనా పార్క‌ర్
ఇందులో హసీనా పార్క‌ర్ సోద‌రుడు దావూద్ ఇబ్ర‌హీంగా  శ్ర‌ద్ధా క‌పూర్  సోద‌రుడు సిద్ధాంత్ క‌పూర్ నటిస్తున్నారు.  అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హసీనా పార్కర్ పాత్రని శ్రద్ధా కపూర్ పోషిస్తుండగా, దావూద్ పాత్రలో శ్రద్దా కపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్ పోషించడం యాధృచ్చికమే అయినా రియల్ లైఫ్ లో వీరిద్దరూ తోడబుట్టినవారే కావడం విశేషం.  
Image result for హ‌సీనా పార్క‌ర్
ఇక ట్రైల‌ర్ విషయానికొస్తే హ‌సీనా పార్క‌ర్‌గా శ్ర‌ద్ధా క‌పూర్ న‌టించి తాను ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించిన ప‌క్కింటి అమ్మాయి పాత్ర‌ల‌కు భిన్నంగా కనిపిస్తోంది. 
ఇప్పటికే ఫస్ట్‌లుక్‌,  పోస్టర్లతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది.  హసీనాకి ఉన్న ప‌వర్ ని చూపిస్తూ ..చెల్లిగా, భార్యగా, అమ్మగా ఆమెలో ఆడతనాన్ని లోకానికి చెబుతూ గాడ్ మదర్ గా ఎలా ఎదిగింది అని చూపించారు.
Image result for హ‌సీనా పార్క‌ర్
అలాగే సోద‌రుడు చేసిన నేరాల‌కు పోలీసులు త‌న కుటుంబానికి పెడుతున్న ఇబ్బందుల‌ను హసీనా ఎలా ఎదిరించింది? త‌న వాళ్లంద‌రినీ కోల్పోయిన‌పుడు ఎలా స్థైర్యంగా నిల‌బ‌డి పోరాడింద‌నే విష‌యాల‌ను ఈ సినిమాలో చూపించ‌నున్నారు. ఇందులో గాడ్ ఫాద‌ర్ లా, మాఫియా యువ‌రాణిలా త‌న ప్ర‌తాపాన్ని దావూద్ సోద‌రి ఎలా చూపించిందో ప‌రిచ‌యం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: