డ్రగ్స్ రాకెట్ లో బయట పడ్డ 9మంది సెలబ్రిటీస్ ను రేపటి నుండి ఎక్సైజ్ వారు విచారణ చేయనున్నారు. అయితే ఇంటరాగేషన్ లో సహకరించకపోయినా లేక అనుమాదాస్పదంగా ఉన్నా అక్కడికక్కడే అరెస్టు చేసే ఆలోచనలో ఉన్నారట పోలీసులు. అనుమానితులుగా నోటీసులు అందుకున్నా పోలీసు వారి దగ్గర ఉన్న చిట్టా ప్రకారం లిస్ట్ లో ఉన్న వారందరికి ఈ డ్రగ్స్ మాఫియాతో సంబంధం ఉందని అంటున్నారు.


ఇక ఇంటరాగేషన్ లో పోలీసులకు ఏమాత్రం డౌట్ అనిపించినా ఇక వారికి కష్టాలు తప్పేలా లేవు. ఇక ఈ విషయం పట్ల సోషల్ మీడియాలో జరుగుతున్న హంగామా తెలిసిందే. ఎప్పుడు ఎవరు ఎలాంటి సంచలన వార్త ప్రకటించేస్తారో అని అందరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. జూలై 19 నుండి 28వరకు సాగే ఈ విచారణలో నోటీసులు అందుకున్న సెలబ్రిటీస్ అంతా అటెండ్ అవ్వాల్సిందే.


ఇప్పటికే నోటీసులు అందిన వారి నుండి విషయం ఎలా రాబట్టాలి అన్న పంథాలో పోలీసుల విచారణ జరుగుతుందట. టాలీవుడ్ ను షేక్ చేస్తున్న ఈ డ్రగ్ మాఫియాలో వినపడుతున్న పేర్లన్ని సెలబ్రిటీస్ వే అవడం వల్ల ఈ న్యూస్ మరింత స్పెషల్ న్యూస్ అయ్యింది. కేవలం వ్యక్తిగత అవసరాలకు మాత్రమే అని నిర్ధారణకు వస్తే ఏమో కాని వాళ్ల ద్వారా మరొకరికి సరఫరా జరుగుతుంది అని తెలిస్తే మాత్రం కచ్చితంగా ఎఫెక్ట్ పడే అవకాశాలున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: