బిగ్ బాస్ లో అప్పుడే హౌజ్ మెట్స్ మధ్య ఒకరికి ఒకరంటే పడని పరిస్థితులు కబడుతున్నాయి. ఈ క్రమంలో అసలు ఎవరు ఎవరిని ఎలిమేనేట్ చేద్దామా అన్న ఆలోచనలో ఉన్నారు. వారనినందరిని కెమెరా కన్ను కనిపెడుతుంది అన్న ఆలోచన ఒక్కోసారి మరచి హౌజ్ మెట్స్ మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలను బయట పెడుతున్నారు. 


ఇక కుటుంబ సభ్యులుగా ఉండాల్సిన బిగ్ బాస్ హౌజ్ లో అప్పుడే వ్యతిరేక జ్వాలలు మొదలయ్యాయి. ఒకరికి ఒకరంటే ఇష్టం లేకపోవడం కామనే కాని అందరికి నచ్చని ఒకరిద్దరికి ఈసారి ఎలిమినేషన్ తప్పేలా లేదని తెలుస్తుంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కుని వారి పక్కన వారి గురించి కూడా నోరు జారకుండా ఉండలేకపోతున్నారు.


ఇక ప్రస్తుతం షోలో జరుగుతుంది అంతా చూస్తుంటే క్రిటిక్ కత్తి మహేష్ గురించి హౌజ్ మెట్స్ అంతా అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది. అంతేకాదు జ్యోతి విషయంలో కూడా అందరు నెగటివ్ గానే మాట్లాడుతున్నారు. బిగ్ బాస్ అడిగిన ఎలిమినేషన్ రౌండ్ లో సగం మంది జ్యోతి పేరు చెప్పడం తెలిసిందే. అయితే వారు చెప్పినంత మాత్రనా ఆమెను తీసేయడం జరగదు.


అసలు షో ముందుంది ఇంకా చాల టాస్కులు చేయాల్సి ఉంటుంది. మరి ఈ 14 మందిలో అసలు ముందు బిగ్ బాస్ హౌజ్ ను వీడేది ఎవరు అన్నది ఎక్సయిటింగ్ గా మారింది. ప్రస్తుతం అందరు అందరితో సరదాగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. మరి బిగ్ బాస్ రియాలిటీ షోలో ఇంకెన్ని ట్విస్టులు చూడాల్సి వస్తుందో మరి. 



మరింత సమాచారం తెలుసుకోండి: