బిగ్ బాస్ తెలుగులో నటుడు శివబాలాజి కూడా ఉన్న సంగతి తెలిసిందే.. హౌజ్ మెట్స్ తో సరదాగా ఉంటున్న అతని మొదటి టాస్క్ సందర్భంలో కన్నీరు పెట్టడం గురించి తన భార్య నటి మధుమతి షాక్ అయ్యిందట. తన భర్త చాలా ధైర్యవంతుడు అలాంటి తను కన్నీరు పెట్టుకోవడం తను చూడలేకపోయానని అంటుంది. అంతేకాదు ఈ యాంగిల్ అసలు తన భర్తలో ఉందనే విషయం బిగ్ బాస్ ద్వారానే తెలిసిందని అంటుంది మధుమిత.


మధుమిత, శివ బాలాజిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆర్య సినిమాతో శివ బాలాజి మంచి ఫాంలోకి వచ్చాడు. సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ కెరియర్ నెట్టికొస్తున్న శివ బాలాజి హీరోయిన్ పక్కన సైడ్ క్యారక్టర్స్ చేస్తూ వస్తున్న మధుమితను చూసి ప్రేమించాడట. ఇక ఇద్దరికి ఇద్దరి అభిరుచులు నచ్చడంతో పెళ్లి చేసుకున్నారు.


ఇప్పటిదాకా తన భర్త కనుల వెంట నీరు రావడం తాను చూడలేదని కాని బిగ్ బాస్ లో అది చూశానని అంటుంది. తన భర్త అలా కన్నీళ్లు పెడుతుంటే తాను కూడా ఏడ్చానని అంటుంది మధుమిత. ఇక నాలుగో రోజు చేరుకున్న బిగ్ బాస్ హౌజ్ మెట్స్ మధ్య ఇప్పటికే విభేధాలు మొదలయ్యాయి. ఛాన్స్ దొరికితే నచ్చని వారిని బయటకు పంపించేద్దాం అని ఎవరికి వారు అనుకుంటున్నారు.


కేవలం హౌజ్ మెట్స్ ఇచ్చే ఫీడ్ బ్యాక్ ను బట్టే ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుందా లేక బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వెళ్లాలంటే ఇంకా ఏదైనా టెస్ట్ ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది. ఇదంతా ఓకే అనుకున్నా శని ఆదివారాలు ఎన్.టి.ఆర్ ఎంట్రీ ఎలా ఉండబోతుంది. ఈసారి తారక్ హౌజ్ మెట్స్ తో ఎలా కమ్యునికేట్ చేస్తారు అన్న దాని మీద పెద్ద డిస్కషన్స్ జరుగుతున్నాయి.  



మరింత సమాచారం తెలుసుకోండి: