లోకనాయకుడు, విలక్షణ నటుడిగా తనకంటూ తిరుగులేని స్టార్ డమ్ తెచ్చుకున్న స్టార్ హీరో కమల్ హాసన్ ఈ మధ్య వార్తల్లో తరచుగా నిలుస్తోన్న విషయం తెలిసిందే.  ఇప్పటికే దివంగత ముఖ్యమంత్రి జయలలితపై సంచలన వ్యాఖ్యలు చేశారని ఆ మద్య వార్తలు వచ్చాయి. ముఖ్యంగా పలు సీరియస్ అంశాలపై వ్యంగ్యంగా స్పందిస్తూ.. ప్రస్తుత రాజకీయాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ.. గత కొన్నాళ్లుగా కమల్ హాసన్ పలు వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నారు.  ఆ మద్య  ఓ తమిళ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో..మహాకావ్యంగా భావించే ఆ మహాగ్రంథంలో ద్రౌపతికి తీవ్ర అన్యాయానికి గురైపోయిందని కామెంట్ చేశారు.  
Image result for మహాభారతంపై కమల్ హాసన్ బిగ్ బాస్
దీంతో తమిళనాట ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ముఖ్యంగా తమిళ హిందూ సంస్థ హిందూ మక్కల్ కచ్చి (హెచ్ఎమ్కె) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ విషయాన్ని వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. తాజాగా ‘నేనే ముఖ్యమంత్రిని’ అంటూ కమల్‌ చేసిన ట్వీట్లు.. ఆయన రాజకీయ రంగప్రవేశం చేస్తున్నారా? అన్న ప్రశ్నలకు తావిస్తోంది. కమల్‌ తన ట్విటర్‌లో.. ‘కాసేపటిలో ఓ ప్రకటన చేస్తా. అప్పటివరకు ఓపికపట్టండి’ అని ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ పెట్టిన కొద్దిసేపటికే.. ‘నన్ను ఓడిస్తే తిరగబడతా.
Image result for మహాభారతంపై కమల్ హాసన్ బిగ్ బాస్
నేను అనుకుంటే నేనే ముఖ్యమంత్రిని. రండి.. మూర్ఖులకు వ్యతిరేకంగా పోరాడేవాడే నాయకుడు’ అని ట్వీట్‌ చేశారు.  మరోపక్క కమల్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్‌బాస్‌’ షో ఇప్పటికే తమిళనాట దుమారం రేపుతోంది. ఇప్పుడు కమల్‌ తన ట్వీట్‌లో వాడిన సిఎం అన్న పదంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయన రాజకీయ రంగప్రవేశం చేస్తున్నారా? అన్న సందేహాలు మొదలయ్యాయి. 

కమల్ హాసన్ :

మరింత సమాచారం తెలుసుకోండి: