టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇచ్చిన కీలకమైన సమాచారం ఆధారంగా డ్రగ్ కేసులో ఎక్సైజ్ పోలీసులు విచారణ వేగవంతం అయింది అని వార్తలు వస్తున్నాయి. నిన్న సుమారు 10 గంటలపాటు పూరీ జగన్నాధ్‌ ను పోలీసులు విచారించి  తిరిగి ఆగష్టు మూడవ తేది తర్వాత పూరీ జగన్నాధ్‌ను విచారించనున్నారు అని తెలుస్తోంది. 

సిట్ విచారణపై పూరీజగన్నాథ్ మీడియాతో మాట్లాడుతాడు అని అంతాఎదురు చూస్తే పూరి మీడియా ముందు మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయాడు. అయితే పూరి నిన్న రాత్రి తన ఇంటికి చేరుకున్న తరువాత  ఈ విషయాల పై ట్వీట్  చేసాడు.  ‘సిట్ అధికారులకు వేసిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను. కెల్విన్ గ్యాంగ్ తో ఎలాంటి సంబంధం లేదని చెప్పాను నాపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పా నేను  తప్పుడు పనులు ఎప్పుడూ చేయలేదు. జర్నలిస్టుల పై సినిమా తీసిన నాకు. నాలుగు రోజుల నుండి జరుగుతున్న సంఘటనలతో నా కుటుంబసభ్యులు ఏడుస్తున్నరు’ అంటూ తన ఆవేదన వివరించాడు పూరి.

అంతేకాదు  జర్నలిస్టులు తెలిసి తెలియకుండా వార్తలు రాసారుఅని అంటూ తనకు జర్నలిస్టులు మంచి స్నేహితులు అని చెపుతూ తెలిసీ తెలియని కట్టుకథలు మీడియాలో వ్రాయవద్దని కోరుతున్నాడు పూరి. ఇది ఇలా ఉండగా ఈ విచారణలో పూరి కీలకమైన సమాచారాన్ని పూరి  వెల్లడించారని ఎక్సైజ్ పోలీసులు అధికారులు ప్రకటించారు. ఈ సమాచారం ఆధారంగానే ఎక్సైజ్ పోలీసులు మరింత దర్యాప్తు చేయబోతున్నట్లు టాక్. 

అయితే వాస్తవానికి పూరి డ్రగ్ తీసుకొంటున్నాడా లేదా అంశాన్ని నిర్ధారించుకొనేందుకుగాను పూరీ జగన్నాథ్ రక్తనమూనాలను ఎక్సైజ్ అధికారులు సేకరించడం సంచలనం గా మారి ఈ కేసు లో ఇంకా ఎన్ని ట్విస్టులు ఉంటాయో అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికితోడు ఇంకా కీలకమైన సమాచారాన్ని పూరి అందించినట్లు అధికారులు చెపుతూ ఉండటంతో ఈ వ్యవహారం మరిన్ని మలుపులు తీసుకునే ఆస్కారం ఉంది అని అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: