అనుకున్నట్టుగానే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్టింగ్ చేస్తున్న బిగ్ బాస్ షోకి రోజు రోజుకి ఆదరణ ఎక్కువవుతుంది. హౌజ్ మెంట్స్ 14 మంది కొంతమనది ఈ రియాలిటీ షోను అన్ని విధాలుగా ఎంజాయ్ చేస్తుంటే కొందరేమో కాస్త అటు ఇటుగా ఉన్నారు. ప్రస్తుతం జరిగిన మూడు నాలుగు రోజులు ఏవో చిన్న చిన్న మాటలు తప్ప పెద్దగా గొడవలేమి జరుగలేదు.


ఇక బిగ్ బాస్ షోలో పాటిస్పేట్ చేసేందుకు ఎంతోమంది వెనక్కి తగ్గగా ఫైనల్ గా హౌజ్ మెట్స్ గా ఉన్న వారు మాత్రం బిగ్ బాస్ కు ఎంపికయ్యారు. అయితే అసలు వీరు ఈ రియాలిటీ షోలో పాటిస్పేట్ చేసినందుకు ఎంత తీసుకున్నారు అన్నది తెలుసుకోవాలని ఉంటుంది. ఇక పారితోషికాల లెక్క చూస్తే హోస్ట్ గా చేస్తున్న తారక్ భారీగా 7 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని తెలిసిందే.


కంటెస్టంట్స్ విషయానికొస్తే సంపూర్ణేష్ బాబు వారానికి 10 లక్షలు.. ధన్ రాజ్, ముమైత్ ఖాన్, శివ బాలాజి, సమీర్, ఆదర్శ్ వారానికి 7.5 లక్షలు. మధుప్రియ, కల్పన, అర్చన 5 లక్షలు.. మిగిలిన వారిలో ఒకరు 2, మరొకరు 3, మరొకరు 4 లక్షలు అలా వారానికి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట.


ఈ రెమ్యునరేషన్ వారాల లెక్క ఎందుకు అంటే ఏ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది తెలియదు కాబట్టి ఆ వారం వారికి ఆ రెమ్యునరేషన్ ఇచ్చే అవకాశం ఉంది. అందుకే కంటెస్టంట్స్ కు వారాల లెక్క రెమ్యునరేషన్ డీల్ కుదుర్చుకున్నారు. వారం మొత్తం వీరి హంగామా చూసినా శని ఆదివారాల్లో రాబోయే తారక్ ఎపిసోడ్స్ గురించి అందరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: