ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో ప్రభాస్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు గడించిన హీరో ఎవరని ప్రశ్నించుతే టక్కున వచ్చే సమాధానమే రానా. తెలుగు సినిమా పరిశ్రమలో పెళ్లి బాజా వినిపించనున్న హీరోల్లో రానా ఒకరు. బాహుబలి సినిమా తర్వాత రానాకు దేశ వ్యాప్తంగా క్రేజ్ లభించింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి అంతటి ఎంగెస్ట్ ఎవర్ గ్రీన్ బ్యాచ్లర్ రానా పెళ్లి కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియా లో షికార్లు చేస్తున్నాయి.



అయితే ఈ పుకార్లకు పులుస్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్న రానా తన పెళ్లి విషయం పై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా జరిగిన ఓ ఛాట్‌ షోలో రానా పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. ‘నా పెళ్లి ప్రభాస్‌, నితిన్‌ల పెళ్లిల్ల తర్వాతే ఉంటుంది. ఇప్పుడు నా వయసు 33 సంవత్సరాలు మాత్రమే. వాళ్లు నా కంటే పెద్దవాళ్లు.  తన కంటే పెధ్దవాళ్లు కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదని తెలిపాడు. తన కుటుంబసభ్యులు కూడా తన వివాహం గురించి ఇంకా ఆలోచించడం లేదని... అందుకే, తనకు తొందరేమీ లేదని చెప్పాడు. 


Image result for rana daggubati

ఏదిఏమైనా తెలుగు చిత్ర పరిశ్రమలో పెళ్లి కాని హీరోలంటే మీడియా కు, న్యూస్ పోర్టల్స్ కు పండగే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారి వివాహానికి సంబంధించిన రకరకాల ఊహాగానాలను ఎంచక్కా ప్రసారం చేసుకోవచ్చు. పైగా ఇలాంటి వార్తలకు ప్రజల నుంచి మంచి స్పందన కూడా లభిస్తుంది. అందుకే కాబోలు పెళ్లి కాని హీరోల వార్తలంటే మీడియా కు పండగే అని అంటుంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: