తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు మనవడు..అక్కినేని నాగార్జున తనయుడు తన చిన్నతనంలోనే ‘సిసింద్రి’ చిత్రంలో నటించి అందరిచే ఔరా అనిపించిన హీరో అక్కినేని అఖిల్.  మనం చిత్రంలో కనిపించిన అఖిల్ ఆ తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  అయితే ఆ చిత్రం మాత్రం అనుకున్న సక్సెస్ సాధించలేక పోయింది. కానీ అఖిల్ కి మాత్రం ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. అంతే కాదు తన పర్సనల్ లైఫ్ లో కూడా కొన్ని తెరపైకి రావడం..అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడం మొత్తానికి ఆ మద్య అకిల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు.  

అంతే కాదు ఆ మద్య మెగా అమ్మాయి కొణిదెల నిహారికతో అఖిల్ సినిమా తీస్తున్నాడని వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. చివరకు అది కాస్తా నిజం కాదని తేలిపోయింది. మరి, నిహారిక పేరు ఎందుకు వినిపించింది..? అంటే అఖిల్ జవాబు చెప్పారు. ఈ మద్య రానా హోస్ట్ చేస్తున్న ‘నెం.1 యారీ’ ప్రోగ్రామ్ లో నిహారికకు సంబంధించిన కొన్ని సంచలన విషయాలు అఖిల్ బయట పెట్టాడు. గతంలో నిహారికతో కలిసి షార్ట్‌ఫిలింలో నటించినట్టు చెప్పారు. ‘‘దాదాపు 120 మంది భారీ సంఖ్యలో సభ్యులతో కలిసి ఆ షార్ట్ ఫిలింను తెరకెక్కించాం.
Related image
ఆ చిత్రానికి దర్శకత్వం వహించింది తన స్నేహితుడు రాజమౌళి తనయుడు కార్తికేయ అని చెప్పాడు. ఆ షార్ట్ ఫిల్మ్ నిడివి ఎక్కువగా ఉండడంతో నా సినిమాలో ఆమె హీరోయిన్ అని అంతా అనుకున్నారు’’ అని అఖిల్ చెప్పుకొచ్చారు. కాగా, ఇప్పటిదాకా ఆ షార్ట్ ఫిల్మ్ మాత్రం విడుదల కాలేదు.  కారణం ఆ షార్ట్ ఫిలిమ్ ఔట్ పుట్ సరిగా లేదట. 


మరింత సమాచారం తెలుసుకోండి: