టాలీవుడ్ లో గత కొంత కాలంగా వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. దర్శక రత్న దాసరి నారాయణ రావు, ప్రముఖ రచయిత, కవి డాక్టర్ సి.నారాయణరెడ్డి మరణాన్ని జీర్ణించుకోక ముందే..మాస్ మహరాజ రవితేజ తమ్ముడు నటుడు భరత్ కారు ప్రమాదంలో మృతి చెందాడు.  ఇవి సరిపోనట్లు ఇప్పుడు టాలీవుడ్ చుట్టు డ్రగ్స్  కేసులు చుట్టుముట్టాయి.  డ్రగ్స్ వాడుతున్నారని..అమ్ముతున్నారని కొంత మంది ప్రముఖ నటులు, దర్శకులు, టెక్నీషియన్స్ పై కేసులు నమోదు అయ్యాయి.  

నిన్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సిట్ ముందు హాజరు కాగా ఈ రోజు శ్యామ్ కె. నాయుడు హాజరై వివరణ ఇచ్చారు.  తాజాగా సోషల్ మీడియాలో మరో సంచలన వార్త చక్కర్లు కొడుతుంది..అయితే ఇది ఎంత వరకు నిజమో అబద్దమో తెలియదు కానీ యూట్యూబ్ లో వైరల్ గా మారింది.  ఇంతకీ విషయం ఏంటీ అనుకుంటున్నారా..! ప్రముఖ దర్శకులు, నిర్మాత  వైవీఎస్ చౌదరి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు ఓ వార్త ఫిల్మ్ నగర్‌లో హల్‌చల్ చేస్తోంది.  అయితే ఈ విషయాన్ని మాత్రం టాలీవుడ్ లో ఎవరూ స్పష్టం చేయలేక పోతున్నారు..ఇలాంటి రూమర్లు ఈ మద్య బాగా పుట్టుకొస్తున్నాయని అంటున్నారు. 
Image result for yvs chowdary
గత కొంత కాలంగా  తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆయన ఈ దారుణానికి పాల్పడినట్టు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 1998లో "శ్రీసీతారాముల కల్యాణం చూతమురారండి" సినిమాతో దర్శకుడిగా తెరంగ్రేటం చేసిన వైవిఎస్.... తొలి సినిమాతో మంచి విజయమే అందుకున్నారు. అనంతరం హరికృష్ణ, నాగార్జునలతో తీసిన "సీతారామరాజు" సక్సెస్ కావడంతో హిట్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.  ఆ తర్వాత మహేష్ బాబు రెండో సినిమా ‘యువరాజు' చిత్రాన్ని నిర్మించారు.
Image result for tollywood drugs
ఆతర్వాత "లాహిరి లాహిరి లాహిరిలో" చిత్రాన్ని స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించిన చౌదరి ఈ చిత్రంతో మంచి విజయం అందుకున్నారు. ఆ తర్వాత 'సీతయ్య', 'దేవదాసు' చిత్రాలు కూడా సొంతగా నిర్మించి సక్సెస్ అయ్యారు. బాలకృష్ణతో ఈయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘ఒక్కమగాడు’ సినిమా ఇండస్ట్రీ లో దారుణంగా ప్లాప్ అయ్యింది.  అప్పటినుండి చౌదరి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటూ వస్తున్నాడు.  ఆవెంటనే తన దర్శకత్వంలో మోహన్బాబు నిర్మించిన ‘సలీమ్'కూడా పెద్ద ప్లాప్.

ఈ రెండు పరాజయాలతో అటు అర్థికంగా నష్టపోవడం, ఇటు కెరీర్ గ్రాఫ్ కూడా కిందకు పడిపోవడం జరిగింది.   దాంతో మనస్థాపం చెందిన వైవీఎస్ చౌదరి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించినట్లుగా తెలుస్తుంది. అదే సమయంలో తన కుటుంబ సబ్యులు ఉండడంతో వైవీఎస్ చౌదరి బతికిపోయాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్త నిజమో కాదో నిర్ధారణ కావాల్సి వుంది. అంతే కాదు ఇండస్ట్రీలో ఆయన సన్నిహితులు కూడా ఈ విషయంపై స్పందించలేదు. మరోవైపు ఈ వార్తలు నిజంగా ఫేక్ అని..ఒట్టి రూమర్లు అని కొట్టి పడేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: