స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ డైరక్షన్స్ లో వస్తున్న సినిమా నా పేరు సూర్య. ఇన్నాళ్లు రచయితగా సూపర్ సక్సెస్ అందుకున్న వక్కంతం వంశీ తొలిసారి దర్శకుడిగా మారి చేస్తున్న సినిమా ఇది. లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమా నిర్మాణంలో మెగా బ్రదర్ నాగబాబు కూడా భాగస్వామ్యం కానున్నారు. 


ఈ సినిమా టైటిల్ నా పేరు సూర్య.. ఇక ఉపశీర్షికగా నా ఇల్లు ఇండియా అని పెట్టారు. సినిమాలో బన్ని జవాన్ గా కనిపిస్తాడని టాక్. అయితే బన్ని జవాన్ లుక్ ఎలా ఉండబోతుంది అన్న ఎక్సయిట్మెంట్ ఫ్యాన్స్ లో పెరిగింది. రీసెంట్ గా టాఫ్రిక్ రూల్స్ అవగాహన కార్యక్రమంలో అల్లు అర్జున్ రాజమౌళి వచ్చారు. అక్కడకు వచ్చిన బన్ని లుక్ చూసి అందరు షాక్ అయ్యారు. 


స్టైలిష్ స్టార్ స్రికొత్త స్టైల్ లో కనిపిస్తున్నట్టు అనిపించింది. జవాన్ లుక్ కోసం బన్ని ఆర్మీ కటింగ్ లో కనిపించాడు. బన్ని న్యూ లుక్ చూస్తుంటే బాక్సాఫీస్ షేక్ చేయడం ఖామనిపిస్తుంది. అను ఎమాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కథ విని బన్ని చాలా ఎక్సయిట్ అయ్యాడని అంటున్నారు.


ఈమధ్యనే దువ్వాడ జగనాధం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బన్ని ఈసారి అంతకుమించిన హిట్ అందుకునేందుకు వస్తున్నాడు. వంశీ మొదటి సినిమానే అయినా రచయితగా అనుభవం ఉంది కాబట్టి సినిమా అనుకున్న దాని కంటే అద్భుతంగా వస్తుందట. సినిమా బన్ని కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా ఉంటుందని అంటున్నారు.


సరైనోడు, డిజె సక్సెస్ ల హుశారులో ఉన్న బన్ని వంశీ తో నా పేరు సూర్య చేస్తున్నాడు. ఇక ఇది పూర్తి కాగానే లింగు స్వామి డైరక్షన్ లో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా తెలుగు తమిళ భాషల్లో బైలింగ్వల్ గా రానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: