టాలీవుడ్ ను షేక్ చేస్తున్న డ్రగ్స్ వ్యవహారంలో విచారణ ఇంట్రస్టింగ్ గా సాగుతోంది. తొలిరోజు స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ను విచారించిన సిట్.. రెండో రోజు కెమెరామ్యాన్ శ్యామ్ కె నాయుడును విచారించింది. తొలిరోజు సుమారు 11 గంటలపాటు పూరీని సిట్ బృందం విచారించింది. రెండో రోజు శ్యామ్ కె నాయుడిని మాత్రం ఆరు గంటలపాటు ప్రశ్నించారు. పూరీ స్టేట్ మెంట్ తో శ్యామ్ స్టేట్ మెంట్ ను పోల్చుతూ ప్రశ్నలడిగినట్లు సమాచారం.

Image result for puri jagannadh drugs sit

శ్యామ్ కె నాయుడు ఉదయం పది గంటలకే విచారణకు హాజరయ్యాడు. అప్పటికి అధికారులు కూడా ఆఫీసుకు రాలేదు. పూరీ జగన్నాధ్ ను విచారించిన గదిలోనే శ్యామ్ ను కూడా విచారించారు. మొదట సిట్ బృందం శ్యామ్ ను ప్రశ్నించింది. ఆ తర్వాత సైకియాట్రిస్ట్ టీమ్, నార్కోటిక్ టీమ్ విచారణ జరిపింది. చివరగా అకున్ సభర్వాల్ నేతృత్వంలో ఎన్ ఫోర్స్ మెంట్ టీమ్ ప్రశ్నించింది.

Image result for sham k naidu

శ్యామ్ కె నాయుడు విచారణలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది. ముఖ్యంగా వివిధ కొరియర్ల ద్వారా నేరుగా శ్యామ్ కె నాయుడు ఇంటికే డ్రగ్స్ వచ్చినట్లు విచారణలో అధికారులు ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా వారు శ్యామ్ ముందు ఉంచినట్లు తెలుస్తోంది.


డ్రగ్స్ పై సీరియస్ గా దృష్టి పెట్టిన ఎక్సైజ్ అధికారులు విచారణను కూడా సీరియస్ గానే నిర్వహిస్తున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పలు కోణాల్లో ప్రశ్నలు సంధించి డ్రగ్స్ వ్యవహారాన్ని అంతు తేల్చే పనిలో పడ్డారు. విచారణకు హాజరవుతున్నవారికి కూడా పూర్తిగా సహకరించాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. దీంతో వారు కూడా మొదట తటపటాయిస్తున్నా.. ఆ తర్వాత మాత్రం దారిలోకి వస్తున్నారు.

Related image

మూడో రోజు విచారణకు ప్రముఖ నటుడు సుబ్బరాజు హాజరుకానున్నారు. అయితే ఇప్పటివరకూ 12 మంది టాలీవుడ్ ప్రముఖులకు సిట్ నోటీసులు జారీ చేసింది. మిగిలిన వారికి కూడా నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. మరోవైపు కొరియర్ ద్వారా ఎవరెవరికి డ్రగ్స్ చేరాయనే అంశంపై కొరియర్ సంస్థలను విచారించి వివరాలు సేకరించనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: