సినిమా పరిశ్రమ ని డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. తెల్లారితే తమ ముందర డాన్స్ లు చేసి పాటలు పాడి డైరెక్షన్ లు చేసే సినిమా జనాలు నిరంతరం డ్రగ్స్ లలో ఇరుక్కుని ఉంటారా అంటూ జనాలు సైతం భలే ఆశ్చర్య పోతున్నారు. గత రెండు రోజులుగా జరుగుతున్న విచారణ మరొక ఐదు రోజుల పాటు కొనసాగుతున్నట్టు సమాచారం. ఈ నేపధ్యం లో సీత కార్యాలయానికి తమ తమ లాయర్ లతో సహా వచ్చి తమకేమీ తెలీదు అని ఇంటరాగేషన్ లో పాల్గొంటున్నారు సినిమా జనాలు.

Image result for సిట్ విచారణ

ఈ సిట్ ఆఫీస్ లో విచారణ పద్ధతి ఎలా ఉంటుందో చూద్దాం .. సిట్ కార్యాలయం లోకి వారు రావడం రావడమే సీసీ కెమెరాలు ఆయా వ్యక్తులని పూర్తిగా చుట్టు ముట్టేసి గమనిస్తూ ఉన్నాయి. కాసేపు వారిని వెయిట్ చేయించి అధికారులు ఒక మానసిక నిపుణుడు, ఇద్దరు అధికారుల మధ్యన సదరు వ్యక్తిని కూర్చో పెడుతున్నారు. మొదటగా వారి వ్యక్తిగత జీవితం , సినిమా ఇండస్ట్రీ లోకి ఎలా వచ్చారు లాంటి అనేక విషయాలు అడిగి తెలుసుకుంటోంది సిట్. కంగారుగా ఉన్నవారిని నార్మల్ చేసి ఆ తరవాత తమకి కావాల్సిన సమాచారం అడుగుతున్నారు.

Image result for సిట్ విచారణ

సినీ పరిశ్రమలో డ్రగ్స దందా గురించి మీకు తెలిసింది చెప్పండి అనగానే వచ్చిన వారంతా తమకు ఏమీ తెలియదని చెబుతున్నారు. దీంతో పార్టీల్లో పాల్గొన్న ఫోటోలు బయటపెడుతున్నారు. డ్రగ్ సప్లయర్ కెల్విన్ తో ఉన్న సెల్ఫీలు ఆ కాసేపటికి బయట పెడుతున్నారు. అది పొరపాటున లేదా ఫాన్స్ తో దిగినట్టు దిగిన సెల్ఫీ అని చెబితే మాత్రం అతనితో జరిపిన ఫోన్ సంభాషణ, లేదా ఛాట్ వివరాలను అతని ముందు ఉంచుతున్నారు.

Image result for సిట్ విచారణ

దీంతో అవాక్కైన సినీ ప్రముఖులు తమ తప్పు ఒప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. అనంతరం ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తారా? లేదా? అన్న అంగీకారపత్రాన్ని కూడా వారి లాయర్ సమక్షంలో తీసుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: