తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది వారసత్వపు హీరోలు ఎంట్రీ ఇచ్చారు.  స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు శీను’ చిత్రంతో మంచి మార్కులు కొట్టేశాడు.  డ్యాన్స్, ఫైట్స్ లో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్నాడు.  తర్వాత వచ్చిన చిత్రం ‘స్పీడున్నోడు’ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది.  దీంతో మనోడి కెరీర్ అయోమయ స్థితిలో పడిపోతుందని భావించిన బెల్లం కొండ సురేష్ తనయుడికి మంచి హిట్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో స్టార్ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తీస్తున్నారు.  

‘జయ జానకి నాయక’ చిత్రం ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఆ తర్వాత రిలీజ్ అయిన టీజర్ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. తాజగా ఈ చిత్రానికి సంబంధించి మరో టీజర్ రిలీజ అయ్యింది.  అయితే ఈ టీజర్ లో బెల్లంకొండ శ్రీనివాస్ తన యాక్షన్ సీన్లతో దుమ్ము రేపాడు.  మొదటి టీజర్ లో కూల్ గా కనిపించిన ఈ యంగ్ హీరో సెకండ్ టీజర్ లో మాత్రం కాస్త వైలెంట్ గా కనిపించాడు.

 ఇక ఫైట్స్, సాంగ్స్ విషయంలో బోయపాటి మార్క్ వేరుగా ఉంటుందన్న విషయం తెలిసిందే. 54 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ ను హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో, పవర్ ఫుల్ డైలాగ్ తో నింపి తన ట్రేడ్ మార్కును గుర్తుచేశారు.

అంతేగాక సినిమాలో యాక్షన్ మోతాదు ఎక్కువగానే ఉంటుందని కూడా చెబుతున్నారు.  ఈ చిత్రంలో  బెల్లంకొండ శ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్య జైస్వాల్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా చిత్రాన్ని ఆగష్టు 11న రిలీజ్ చేయనున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: