భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించిన షో ‘బిగ్ బాస్’.  బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తుండగా తమిళంలో విశ్వనటుడు కమల్ హాసన్ హోస్ట్ గా కొనసాగుతున్నారు.  ఇక మొట్టమొదటి సారిగా తెలుగు బుల్లితెరపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ‘బిగ్ బాస్’ షోకి నిర్వహిస్తున్నారు.

 ఇప్పటి ఈ షో పై రక రకాల కామెంట్స్..కాంప్లిమెంట్స్ వస్తున్న నేపథ్యంలో నాలుగు రోజులు ముగిశాయి.  బాలీవుడ్ లో బిగ్ బాస్ షో కి ఎంతో క్రేజ్ వచ్చింది..అయితే తెలుగు లో మాత్రం కాస్త సప్పగా సాగుతున్నట్లు పలువురు పెదవి విరుస్తున్నారు.  అయితే మొన్నామద్య ఆదర్శ్ కాస్త రచ్చ రచ్చ చేశాడు..తర్వాత ఎపిసోడ్ లో హరితేజ, ప్రిన్స్, ఆదర్శ్ మద్య కాస్త రగడ కొనసాగింది.

తర్వాత ఇరువుర సారీ చెప్పుకోవడంతో సమస్య కూల్ గా ముగిసింది.  అప్పుడుప్పుడు కాంటెస్ట్ ల మద్య చిన్న చిన్న గొడవల మినహా పెద్దగా విషయం లేదనిపిస్తుంది.  తాజాగా జరిగిన ఎపిసోడ్ లో సమీర్ ని బిగ్ బాస్ హౌజ్ నుంచి తొలగిస్తున్నట్లు చెప్పాడు.  అయితే దీనికి కారణం సమీర్ కి బిగ్ బాస్ సీక్రెట్ గా ఆపరేషన్ అప్పటించాడు..కానీ అది అమలు పర్చడంలో సమీర్ విఫలం చెందడంతో అతన్ని నేరుగా ఎలిమినేట్ చేస్తున్నట్లు బిగ్ బాస్ చెప్పారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: