బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ షో రాను రాను రసవత్తరంగా మారుతుంది.  అయితే ఈ షోలో చిన్న చిన్న కలహాల మినహా పెద్దగా గొడవపడ్డ సంఘటనలు ఏమీ జరగలేదు.  మిగతా భాషల ‘బిగ్ బాస్’ షో లతో  పోల్చుకుంటే తెలుగు లో చాలా కూల్ గా సాగుతుందని అంటున్నారు.  ఇక బిగ్ బాస్ లో టీమ్ కెప్టెన్ అంటే చాలా గౌరవమైన స్థానం అని తెలుసు. అప్పట్లో ఎన్టీఆర్ ఈ షో గురించి వివరిస్తూ..ఈ విషయాన్ని తెలిపారు.  

కెప్టెన్ గా నామినేట్ అయిన వారికి ప్రత్యేక సదుపాయలతో పాటు ఇతర సభ్యులతో పని చేయాల్సిన అవసరం ఉండదు.  అయితే  బిగ్ బాస్ షో మొదటి రోజు ఎవరు తక్కువ స్థానంలో ఉండి బిగ్ బాస్ హౌజ్ నుంచి వెళితే బాగుంటుందని సభ్యులను కోరగా చాలా మంది సంపూర్ణేష్ బాబు పేరు సూచించారు.  అయితే అందరూ పాపం సంపూ బిగ్ బాస్ షో నుంచి వెళ్లిపోతారని అనుకున్న సమయంలో..బిగ్ బాస్ మాత్రం అందరికీ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. మొదటి వారం బిగ్ బాస్ హౌజ్ కి కెప్టెన్ గా సంపూర్ణేష్ బాబు పేరు సూచించి అందరికీ షాక్ ఇచ్చాడు.

 ఇక సంపూ కెప్టెన్ గా ఉంటూ అతనికి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు బిగ్ బాస్.  కానీ సంపూ మాత్రం ఆ సూచనలు అమలు పర్చడంలో పూర్తిగా విఫలం చెందారు. అంతే కాదు సంపూర్ణేష్ ఎక్కువగా హౌజ్ లో నిద్ర పోవడం వల్ల టీమ్ ని సరిగా లీడ్ చేయలేక పోయాడని ఫిర్యాదు వచ్చింది.  దీంతో నిన్నటి ఎపిసోడ్ లో సంపూర్ణేష్ కెప్టెన్సీని తొలగించి అతడిని ఎపిసోడ్స్ అయ్యేంత వరకు కెప్టెన్సీగా తీసుకోరని బిగ్ బాస్ సంపూకి షాక్ ఇచ్చారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: