జూనియర్ ఎన్టీఆర్ రానాలు ఇంచుమించు ఒకేసారి బుల్లితెర పై తమ ఇమేజ్ పెంచుకోవడానికి హోస్ట్ చేస్తున్న కార్యక్రమాల రేటింగ్స్ లో జూనియర్ ‘బిగ్ బాస్’ షోకన్నా రానా హోస్ట్ చేస్తున్న ‘నెం. 1 యారి’ షోకు రేటింగ్స్ బాగా వస్తూ ఉండటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఇమేజ్ లో జూనియర్ స్థాయితో రానా స్థాయి చాల తక్కువే అయినా వారి షోలు మాత్రం రానాను ఎలివేట్ చేయడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 

‘బాహుబలి’ తో రానాకు వచ్చిన ఇమేజ్ కు తోడు ‘నెం.1 యారి’ ప్రోగ్రాం కాన్సెప్ట్ కొత్తగా ఉండటంతో ఈ ప్రోగ్రాం టెలివిజన్ లో సూపర్ హిట్టయింది. ఉత్సాహంగా కబుర్లు చెబుతూనే స్టార్ల గురించి అభిమానులకు తెలియని విషయాలు ఎన్నో బయటకు రాబట్టడంలో రానా సూపర్ గా సక్సెస్ అయ్యాడు అన్న వార్తలు వస్తున్నాయి. 

అంతేకాదు అతడి హోస్టింగ్ అందరినీ మెప్పించేలా ఉండటంతో ‘నెం. 1 యారి’ టి.ఆర్.పి. రేటింగ్స్ లో జూనియర్ ‘బిగ్ బాస్’ షో కన్నా ముందుకు దూసుకు పోతోంది. ఇప్పటికి మూడు ఎపిసోడ్లు మాత్రమే పూర్తయిన ఈ ప్రోగ్రాంకు 9.1 రేటింగ్స్ వచ్చాయని టాక్. 

దీనికితోడు జూనియర్ ‘బిగ్ బాస్’ షో’ అతి నీరసంగా నడుస్తున్న నేపధ్యంలో రానా షో పట్ల చాలామంది ఆ శక్తి కనబరుస్తున్నారు. రానా డైలాగ్ డెలివరి లో ఉండే గాంభీర్యం కూడా ఈ కార్యక్రమానికి ప్లస్ పాయింట్ గా మారింది అని అంటున్నారు. 

మరికొందరైతే ఇప్పటి వరకు టాప్ హీరోల రేస్ లో దూసుకుపోతున్న జూనియర్ అనవసరంగా ‘బిగ్ బాస్’ షోలో వేలు పెట్టి తన క్రేజ్ పై ప్రయోగం చేసుకుంటున్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు టీఆర్పీ రేటింగ్స్ రేసులో జూనియర్ కన్నా ముందు స్థానంలో ఉన్న రానాను అధిగమించాలి అంటే ‘బిగ్ బాస్’ షోలో ఏదైనా అద్భుతం జరగాలి అని అంటున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: