సినీరాజ‌కీయ ప్ర‌ముఖుల గ‌త జ‌న్మ‌ల విశేషాలు చెబుతూ సంచ‌ల‌నంగా మారుతున్నారు ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వీ నాగనాథ్. సెల‌బ్రెటీలు గ‌త జ‌న్మ‌లో ఎక్క‌డ ఏ రూపంలో జ‌న్మించారు? ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర్కున్నారు? ఎలా చ‌నిపోయారు? అనే విష‌యాల‌ను తెలుపుతూ ఎస్వీనాగ్‌నాథ్ చేస్తున్న ప్రొగ్రాం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.  


గ‌త జ‌న్మ ఆవిష్క‌ర‌ణ 
ప్ర‌తి వారం ఒక సెల‌బ్రెటీ గ‌త జ‌న్మ తెలిపే ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వీ నాగనాథ్ తాజాగా స్టార్ హీరోయిన్ అనుష్క‌ పాస్ట్ లైఫ్ ఎపిసోడ్ చేశాడు. అనుష్క‌ గ‌త జ‌న్మ‌ఎలా ఉండేది? గ‌త జ‌న్మ ఎక్క‌డ ఎలా సాగింది? అనే విష‌యాల‌పై నాగనాథ్ చేసిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూ హల్‌చల్ చేస్తోంది.


ర‌ష్యాలో జ‌న్మించిన అనుష్క‌
పూర్వ జ‌న్మ‌లో అనుష్క ర‌ష్యాలో జ‌న్మించింద‌ని అస్ట్రో సైకాల‌జిస్ట్ నాగ్‌నాథ్ తెలిపారు. అప్ప‌ట్లో ఆమె అపురూప సౌంద‌ర్య‌వ‌తి అని చెప్పారు. ఈ దేవ‌సేన పూర్వజ‌న్మ జాత‌కంలో అనేక ఎత్తుప‌ల్లాలు జ‌రిగాయ‌ట‌. అందంతో కూడిన అహంకారం ఆమె జీవితాన్నే మార్చేసింద‌ని చెప్పారు. త‌న‌కంటూ 20 ఏళ్లు పెద్ద వ్య‌క్తి అయిన ఓ క‌ళాకారుడిని పెళ్లాడింద‌ట‌. ఆ జ‌న్మ‌లో అనుష్క‌కు పిల్ల‌లు లేరట‌. అనారోగ్య స‌మ‌స్యల‌తోనే అనుష్క గ‌త జ‌న్మ ముగించింద‌ట‌. అప్ప‌టి ప‌రిస్థితుల ప్ర‌భావం వ‌ల్ల ఆమె లైఫ్‌లో ఊహించ‌ని అనేక ప‌రిణామాలు జ‌రిగిన‌ట్టు నాగ్‌నాథ్ తెలిపారు. 


నేను ఎవ‌ర్నీ..?
న‌మ‌స్తే తెలుగు ఛాన‌ల్‌లో హూ ఏమ్ ఐ(who am I) ఎపిసోడ్ ప్ర‌సార‌మ‌వుతోంది. ఇందులో ప్రముఖుల గ‌త జ‌న్మ ర‌హస్యాల‌ను జ్యోతిష్య శాస్త్ర ఆధారంగా చెబుతారు. ఇందులో తాజాగా ప్ర‌సార‌మైన అనుష్క పాస్ట్ లైఫ్ ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్ మారుతోంది.


వైర‌ల్ అవుతున్న ప్రొగ్రాం
సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులంద‌రి పాస్ట్ లైఫ్ ఎపిసోడ్‌ల‌తో ఈ కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని, ప్ర‌తి వారం ఒక ఎపిసోడ్ ప్ర‌సార‌మ‌వుతుంద‌ని ప్రొగ్రామ్ డైరెక్ట‌ర్ స్వామి ముద్దం తెలిపారు. తాజాగా ప్ర‌సారం చేసిన అనుష్క‌ పాస్ట్ లైఫ్ వీడియోకు విశేష స్పందన వస్తోందని చెప్పారు. సెల‌బ్రెటీల పాస్ట్ లైఫ్‌ల‌ను ఆవిష్క‌రించే ఇలాంటి కార్య‌క్ర‌మం మీడియా చ‌రిత్ర‌లో తొలిసార‌ని చెప్పారు.

https://youtu.be/-xvAFsmJnPM



మరింత సమాచారం తెలుసుకోండి: