శివ నిర్వాణ డైరెక్షన్ లో నాని హీరోగా వచ్చిన నిన్ను కోరి సినిమా ఈ మధ్యనే ప్రేక్షకుల ముందరకి వచ్చింది. నివేతా థామస్ హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రం ఓవర్ సీస్ , ఇండియా రెండు చోట్లా పెద్ద వసూళ్లు రాబట్టింది. యూఎస్ లో దాదాపు తొలి వారం లోనే 1 మిలియన్ వసూళ్లు సాధించిన ఈ సినిమా సరికొత్త రికార్డు తన ఖాతా లో వేసుకుంది.


ఈ ఏడాది యూఎస్ఏ బాక్స్ ఆఫీస్ దగ్గర అతిపెద్ద గ్రాసర్ గా ఉన్న టాప్ ఐదు చిత్రాల్లో ఈ సినిమా కూడా ఉండడం విశేషం. 128 కోట్లు వసూలు చేసి 'బాహుబలి 2' మొదటి స్థానాన్ని ఆక్రమించింది. 16.33 కోట్ల రూపాయలను రాబట్టి రెండవ స్థానంలో 'ఖైదీ నెంబర్ 150' కొనసాగుతోంది.


మూడవ స్థానం లో గౌతమీ పుత్ర శాతకర్ణి 11 కొట్లువ్ అసూలు చెయ్యగా, నిన్ను కోరి సినిమా ఏడున్నర కోట్ల తో నాల్గవ స్థానం లో ఉంది. కాటమరాయుడు ఏడు కోట్ల నలభై లక్షలతో ఐదవ స్థానం లో ఉంది 

మరింత సమాచారం తెలుసుకోండి: