ఈరోజు ఉదయం సిట్ అధికారుల ముందు విచారణ కోసం వచ్చిన నవదీప్ లుక్ ను చూసి మీడియా వర్గాలు షాక్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ డ్రగ్స్ కేసు విచారణకు సంబంధించి పూరి సుబ్బరాజు శ్యాం కె. నాయుడు తరుణ్ ల వ్యవహార శైలికి భిన్నంగా నేడు సిట్ అధికారుల ముందుకు వచ్చిన నవదీప్ లుక్ లో బాడీ లాంగ్వేజ్ లో స్పష్టమైన మార్పు కనిపించడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.

డ్రగ్స్ కేసులో తీవ్ర ఆరపణలు ఎదుర్కొంటున్న నవదీప్  ఈ రోజు ఉదయం 10.20 గంటలకు సిట్ కార్యాలయానికి వచ్చారు.సిల్వర్ కలర్ పెద్ద కారులో తన తోటి మిత్రులతో కలిసి వచ్చిన నవదీప్ సీరియస్ గా కార్యాలయానికి చేరుకున్నాడు. గ్రే కలర్ ఫ్యాంట్ వైట్ కలర్ షర్ట్ తో వచ్చిన నవదీప్ తన షర్ట్ మొదటి బటన్ను వదిలేయటం ఫుల్ హ్యాండ్స్ షర్ట్ వేసుకున్న అతడు తన కబ్స్ ను కాస్త మడవటం కనిపించడంతో నవదీప్ షూటింగ్ స్పాట్ కు రెడీ అయి వచ్చాడా అని అనిపించే విధంగా అతడి లుక్ కనిపించింది అన్న వార్తలు వస్తున్నాయి.

అంతేకాదు సీరియస్ వదనంతో చకచకా లోపలికి వెళుతున్ననవదీప్ హఠాత్ గా మీడియా కెమెరాలను చూసి  తన రెండు చేతులు పైకెత్తి రాజకీయనేత తరహాలో నమస్కారం పెట్టటం పలువురికి షాకింగ్ గా మారింది అన్న మాటలు వినిపిస్తున్నాయి. తీవ్రమైన ఆరోపణలతో విచారణకు వచ్చిన నవదీప్ విచారణకు వెళ్ళే సమయంలో కాన్ఫిడెంట్ గా కనిపించిన తీరు చాలామందిని ఆశ్చర్య పరిచింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా ఈరోజు విచారణ ఎదుర్కుంటున్న నవదీ‌ప్ నుండి చాల కీలక సమాచారం రాబట్టడానికి సిట్ అధికారులు భారీ కసరత్తు చేసినట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈవెంట్‌ ఆర్గనైజర్‌గా చలామణీ అవుతున్నాడట నవదీప్.  అంతేకాదు ప్రముఖుల కుటుంబాల్లో జరిగే పార్టీలకు కావాల్సిన ఏర్పాట్లను అతడే చేస్తున్నట్లు వార్తలు కూడ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నవదీప్‌ని ఎక్కువ సమయం విచారించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: