డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా నేడు సిట్ అధికారులు నవదీప్ ను విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే నవదీప్ నుండి కీలక ఆధారాలను సేకరించాలని భావించిన సిట్ అధికారులకు నవదీప్ పూర్తిగా సహకరించడం లేదనే సమాచారం మీడియా కు అందింది. అయితే సిట్ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు నవదీప్ నో అనే సమాధానం చెబుతున్నట్టు తెలిసింది. అయితే సైట్ విచారణలో నవదీప్ కీలక ఆధారం కావడంతో ఎలాగైనా సరే ఆతని నుండి కీలక సమాచారాన్ని రాబట్టాలని సిట్ అధికారులు భావిస్తూ ఉండడంతో ఏకంగా మధ్యాహ్న భోజనం



ముగిసిన తర్వాత జరిపే విచారణలో ఏకంగా అకున్ సబర్వాల్ నే విచారణ లోకి దింపాలని సిట్ భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటివరకూ నవదీప్ కు వ్యతిరేకంగా తమ వద్ద ఉన్న సాక్ష్యాలను సైతం అధికారులు ఇంకా నవదీప్ ముందు పెట్టలేదని సమాచారం. సబర్వాల్ వచ్చి కూర్చున్న తరువాత, వాటిని ఒక్కొక్కటిగా ముందుంచి నవదీప్ ను మరింత లోతుగా విచారించాలని అధికారులు భావిస్తున్నారు.


Image result for navadeep

అప్పటివరకు అధికారుల విచారణకు సహకరించాలని లేని పక్షంలో జరగబోయే పరిణామాలను గురించి నవదీప్ కు వివరించాలని సిట్ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇక నవదీప్ పబ్ లో అత్యంత ముఖ్యలకు మాత్రమే ఇచ్చే ప్రత్యేక కాక్ టైల్ డ్రింక్ తయారీ, దానిలో కలిపే పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయన్న విషయంపై దాదాపు రెండు గంటల పాటు నవదీప్ ప్రశ్నలను ఎదుర్కోవచ్చని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: