న్యాయస్థానం ముందు ఎంతటి వారైనా శిక్షార్హులే అని మరోసారి నిరూపణ అయ్యింది.  ప్రముఖ మళియాళ నటి భావన పై ఆమె డ్రైవర్ మిగతా ఇద్దరు నిందితులతో కలిసి లైంగిక వేధింపులకు గురి చేసిన విషయం అప్పట్లో పెద్ద సంచలనం అయ్యింది.  దీనిపై నటి భావన కు మద్దతుగా మళియాళ ఇండస్ట్రీతో పాటు అన్ని సినిమా ఇండస్ట్రీలో సపోర్ట్ చేశాయి.  మొత్తానికి ఈ కేసులో ప్రధాన నింధితుడు సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సునీ ని అరెస్టు చేశారు పోలీసులు.  

Image result for actress bhavana rape

ఆ తర్వాత ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు మరికొన్ని షాకింగ్ నిజాలు తెలిసాయి.  నటి భావన పై కక్ష్య తీర్చుకునే నేపథ్యంలో మళియాళ సినీ నటుడు దిలీప్ ఈ కుట్ర పన్నారని ఈ కేసులో అరెస్టు అయిన ప్రముఖ నిందితుడు సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సునీ అంగీకరించాడని పోలీసులు కోర్టులో చెప్పారు.  దీంతో దిలీప్ ని అరెస్టు చేశారు పోలీసులు. అప్పటి నుంచి ఎన్నో కీలక విషయాలు బయట పడుతూనే ఉన్నాయి.  

Image result for actress bhavana rape

ఇక దిలీప్ బెయిల్ కోసం దరఖాస్తు పెట్టుకోగా..పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతనికి బెయిల్ ఇస్తే రాజకీయంగా, డబ్బు ప్రభావంతో సాక్షాలు తారుమారు చేసే అవకాశం ఉందని  కోర్టులో చెప్పారు.  మరోవైపు దిలీప్ తరుపు న్యాయవాది ఈ కేసులో అతనికి ఏమాత్రం ప్రమేయం లేదని వాదిస్తున్నారు.  

Image result for kerala supreme court

ఇరు వర్గాల వాదన విన్న కేరళ హైకోర్టు గత నాలుగు రోజుగా పోలీసులు సేకరించిన సాక్షాలు పరిశీలించింది. సోమవారం కేరళ హైకోర్టు దిలీప్ కు బెయిల్ ఇవ్వడం కుదరదని చెప్పింది.  దీంతో దిలీప్ ఇప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించడానికి సిద్దం అయ్యాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: