టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం రోజురోజుకూ ముదిరి పాకాన పడుతోంది. ఇప్పటికే 27 మందిని సిట్ అధికారులు విచారించారు. రోజూ విచారణ పర్వం కొనసాగుతోంది. సినిమా ఇండస్ట్రీకి చెందినవారి పేర్లే ప్రముఖంగా వినిపించడం.. వారినే వరుసపెట్టి విచారిస్తుండడంతో ఆసక్తి మరింత పెరిగిపోయింది. ఇప్పుడు ఈ కేసులోకి ప్రముఖ హీరోయిన్ కాజల్ మేనేజర్ కూడా వచ్చి చేరాడు.


          రోనీ అనే వ్యక్తి కాజల్ అగర్వాల్ కు మేనేజర్ వ్యవహరిస్తున్నాడు. లావణ్య త్రిపాఠి, రాశీ ఖన్నాలకు గతంలో మేనేజర్ గా పనిచేశాడు. ప్రస్తుతం కాజల్ దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఎక్సైజ్ అధికారులు రోనీని అరెస్టు చేశారు. అతని ఇంటి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ వ్యవహారంలో కూడా రోనీ పేరు వినిపించింది. ఈ నేపథ్యంలో రోనీపై సిట్ అధికారులు ఓ కన్నేసి ఉంచారు. ఇంట్లో సోదాలు చేసినప్పుడు గంజాయి పడింది. దీంతో వెంటనే రోనీ ని అదుపులోకి తీసుకున్నారు.

Image result for kajal agarwal manager roni

          డ్రగ్స్ వ్యవహారంలో నటీనటులే కాదు.. వారి మేనేజర్లు, వాళ్ల స్నేహితులు కూడా ఉన్నారని గతంలోనే సిట్ అధికారులు పేర్కొన్నారు. వారిపై నిఘా పెట్టినట్టు కూడా తెలిపారు. ఈ కేసుకు సంబంధించి త్వరలోనే మరికొంతమంది సినీరంగేతరులను కూడా విచారించేందుకు సిట్ సిద్ధమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: