గతవారం విడుదలైన వరుణ్ తేజ్ ‘ఫిదా’ కేవలం మొదటి మూడు రోజులలోనే ప్రపంచ వ్యాప్తంగా 25 కోట్ల గ్రాస్ కలక్షన్స్ ను వసూలు చేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా  మారింది. అంతేకాదు ఈ మూవీ ఓవర్సీస్ లో ఒక మిలియన్ మార్క్ కు అతి చేరువలో ఉంది అన్న వార్తలు వస్తున్నాయి.

ఈమూవీ నిన్న తన సోమవారం పరిక్షను కూడ విజవంతంగా పాస్ కావడంతో ఈమూవీకి హిట్ ముద్ర పడటమే కాకుండా వరుణ్ తేజ్ కెరియర్ లో ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా మారబోతోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో మంచి జోష్ లో ఉన్న దర్శకుడు శేఖర్ కమ్ముల ఒక మీడియా సంస్థకు ఇంటరవ్యూ ఇస్తూ చేసిన కామెంట్స్ పవన్ అభిమానులకు విపరీతమైన ఆగ్రహాన్ని తెప్పిస్తున్నట్లు టాక్.

వరుణ్ తేజ్ ను పవన్ కళ్యాణ్ తో పోలుస్తూ శేఖర్ కమ్ముల కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. పవన్ తన కెరియర్ ప్రారంభంలో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో చేసినట్లుగా వరుణ్ తేజ్ కూడ ‘ఫిదా’ లో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీలో నటించి ఘన విజయం అందుకోవడమే కాకుండా పవన్ వారసత్వాన్ని ఈ విషయంలో కొనసాగిస్తున్నాడు అంటూ శేఖర్ కమ్ముల ఆసక్తికర కామెంట్స్ చేసాడు.

అంతేకాదు కెరియర్ తొలిరోజులలో నటించిన ‘గోకులంలో సీత’ ‘సుస్వాగతం’ ‘తొలి ప్రేమ’ సినిమాలలో హీరోయిన్ ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నట్లుగానే ‘ఫిదా’ లో కూడ హీరోయిన్ పాత్ర ప్రాధాన్యత ఎక్కువగా ఉంది అన్న కామెంట్స్ చేసాడు శేఖర్ కమ్ముల. అంతేకాదు పవన్ తన కెరియర్ తొలిరోజులలో ఒక ప్రేమికుడుగా మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపించి మెప్పించిన విధంగా అటువంటి పాత్రలు వరుణ్ తేజ్ కు బాగా కలిసివస్తాయి అని కామెంట్స్ చేసాడు.

అదేవిధంగా పవన్ ప్రేమికుడి పాత్రల నుండి మాస్ హీరోగా ఎదిగినట్లుగా రానున్న రోజులలో పవన్ వారసత్వాన్ని కొనసాగిస్తూ వరుణ్ తేజ్ ఒక టాప్ మాస్ హీరోగా మారబోతున్నాడు అన్న సంకేతాలు ఇచ్చాడు శేఖర్ కమ్ముల. అయితే టాలీవుడ్ ఎంపరర్ గా కోట్లాది మంది అభిమానులను కలిగిన పవన్ తో పోలుస్తూ అత్యుత్సాహంతో శేఖర్ కమ్ముల చేసిన కామెంట్స్ మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులకు ఏమాత్రం ఇష్టం లేకపోవడమే కాకుండా ఈ కామెంట్స్ తో పవన్ అభిమానులు తీవ్ర అసహనానికి గురి అవుతున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: