అత్యంత భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్యప్రారంభం అయిన ‘బిగ్ బాస్’ షో ఊహించిన స్థాయిలో విజయవంతం కాకపోవడానికి ఒకవిధంగా జూనియర్ ఇమేజ్. ‘బిగ్ బాస్’ షోకు శాపంగా మారిందా ? అన్న ఆసక్తికర కామెంట్స్ కొందరి విమర్శ.  యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై కనిపించబోతుండటంతో ‘బిగ్ బాస్’ షో భారీ సక్సస్ అవుతుందని చాలమంది అంచనా వేశారు. 

‘బిగ్ బాస్’ షోకు సంబంధించి ఎన్టీఆర్ కనిపించిన ప్రోమోలు కూడా అట్రాక్టివ్‌ గా ఉండటంతో ఈకార్యక్రమం పై బుల్లితెర ప్రేక్షకుల అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనితో ప్రేక్షకులు ఈకార్యక్రమం పై చాలఅంచనాలు పెట్టుకున్నారు. అయితే. ఎన్టీఆర్ కనిపించినంతసేపు షోకు రెస్పాన్స్ బాగానే ఉన్నా జూనియర్ లేని సమయంలో ఈకార్యక్రమం మరీ డీలా పడిపోతోంది అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి. 

దీనికికారణం ‘బిగ్ బాస్’ షో పార్టిసిపెంట్స్‌లో ఏ ఒక్కరు ఆడియెన్స్‌ను మెప్పించేలా వ్యవహరించడం లేదని ఈషో చూసిన చాలామంది చర్చించుకుంటున్నారు. ఈషోలో పాల్గొనే వారంతా న్యాచురల్‌గా ఉండాలి. ఒకరితో ఒకరు కలిసిపోవాలి కొట్లాడుకోవాలి, కామెడీ చేయాలి. కానీ ఇందులోని పార్టిసిపెంట్స్‌లో ఎక్కువ మంది మరీ నీరసంగా కనిపిస్తున్నారు అన్నకామెంట్స్ సగటు ప్రేక్షకుల నుండి వస్తున్న నేపధ్యంలో ఈషో ప్రేక్షకులకు అంతగా రీచ్ కావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

దీనితో జూనియర్ ఇమేజ్ ఈకార్యక్రమం వల్ల డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉందని కొందరి అభిప్రాయం. ఏకార్యక్రమం ఫెయిల్ అయినా దానికి ఆకార్యక్రమ హోస్ట్ బాధ్యత వహించాల్సి వస్తుందని ఇక్కడకూడా అదేజరిగి ఎన్టీఆర్‌పై ఆ ఎఫెక్ట్ పడుతుందేమోనని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే జూనియర్ ఈషోలో కనిపిస్తున్నంతసేపు ఈషోను చూడటానికి ఆసక్తి కనపరుస్తున్నవారు జూనియర్ లేకుండా ప్రసారం అవుతున్న ఈషో ఎపిసోడ్స్ పై పెద్దగా ఆసక్తి కనపరచక పోవడం సమాధానం లేని ప్రశ్నగా మారింది.

వీకెండ్ లో ఎన్టీఆర్ రెండురోజుల పాటు వచ్చి దుమ్ముదులిపి ఈషోకి హడావిడి చేసినా నిన్న జూనియర్ లేకుండా ప్రసారం అయిన ఈషో మళ్ళీ నీరసంగానే మారింది అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనితో కేవలం ఎలిమినేషన్ ప్రోసస్ జరిగే వీకెండ్ ఎపిసోడ్స్ లో జూనియర్ కనిపిస్తూ మిగతా రోజులలో ఈషోలో జూనియర్ కనపడకపోతే ప్రయోజనంలేదు అన్న టాక్ సాధారణ ప్రేక్షకులలో ఏర్పడింది అన్నవార్తలు వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: