సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్పైడర్. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హారిస్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉండగా తమిళంలో ఈ సినిమా లైకా ప్రొడక్షన్స్ కొనడం ఈ ప్రాజెక్ట్ కు మరింత సంచలనంగా మారింది.


స్పైడర్ బిజినెస్ మహేష్ స్టామినాను తెలియచేస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే తెలుగు రెండు రాష్ట్రాల్లో రికార్డ్ బిజినెస్ చేస్తుండగా ఇప్పుడు తమిళంలో కూడా అత్యధికంగా 23 కోట్ల వరకు స్పైడర్ మూవీ పలికిందని టాక్. మహేష్ స్పైడర్ తోనే తమిళ నాట ఎంట్రీ ఇస్తున్నాడు అయినా సరే ఈ రేంజ్ బిజినెస్ చేయడం మాములు విషయం కాదు.


ప్రస్తుతం పొస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అని అంటున్నారు. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ లు నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ దాదాపు 130 కోట్లు అని తెలుస్తుంది. సినిమాలో గ్రాఫిక్స్ కు కూడా చాలా ప్రాముఖ్యత ఉందని తెలుస్తుంది. మహేష్ స్పై ఏజెంట్ గా కనిపించబోతున్న ఈ సినిమా కచ్చితంగా మహేష్ ఖాతాలో మరో పెద్ద హిట్ పడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.


బ్రహ్మోత్సవం తర్వాత మహేష్ నుండి వస్తున్న సినిమాగా స్పైడర్ ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పరచుకుంది. రికార్డ్ ప్రైజ్ బిజినెస్ చేస్తున్న ఈ సినిమా అంచనాలను అందుకునేలా ఉంటే ఆ రేంజ్ కలక్షన్స్ కూడా సంపాదిస్తుందని చెప్పొచ్చు. ఇక తమిళంలో ఈ సినిమా హిట్ అయితే మహేష్ కు అక్కడ మార్కెట్ కూడా యాడ్ అయినట్టే. 


మరింత సమాచారం తెలుసుకోండి: