వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వచ్చిన సినిమా ఫిదా.. కథ చెప్పినప్పుడు కాస్త పర్వాలేదు అనుకోగా సినిమా మొత్తం షూటింగ్ జరుగుతున్నా దిల్ రాజు సెట్స్ దగ్గరకు వెళ్లలేదట. అంతేకాదు సినిమా మొత్తం పూర్తయ్యాక సినిమా మీద నమ్మకం లేకనే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ట్రిం కూడా చేయమని చెప్పాడట.


అందుకోసమే దిల్ రాజు సినిమా అయినా సరే ఫిదాకు మాములు ప్రమోషన్స్ తోనే థియేటర్లలోకి వచ్చింది. ఇక మొదటి షో నుండి ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడం తో దిల్ రాజు మైండ్ బ్లాంక్ అయ్యిందట. శేఖర్ కమ్ముల మీద ఉంచిన నమ్మకం నిజమైందని అతన్ని తక్కువ అంచనా వేశామని అనుకున్నాడట దిల్ రాజు.


నిర్మాతగా మంచి అభిరుచి గల సినిమాలను తీసే దిల్ రాజు తన ప్రొడక్షన్ లో వచ్చే సినిమాల మీద ఓ మంచి అవగాహనతో ఉంటాడు. కాని ఫిదా మూవీ దిల్ రాజు అంచనాలను తలకిందలు చేసిందట. సినిమాకు వస్తున్న పాజిటివ్ ఫీడ్ బ్యాక్ చూసి తను చాలా తప్పు చేశానని అనుకున్నాడట దిల్ రాజు.


వరుణ్ తేజ్ హీరోగా వచ్చినా హీరోయిన్ సాయి పల్లవి సినిమాను నిలబెట్టేసింది. శేఖర్ కమ్ముల ఆమె పాత్ర ద్వారానే సినిమా మొత్తం ఎంటర్టైనింగ్ గా నడిపించాడు. అనామిక తర్వాత శేఖర్ కమ్ముల ఫిదా నిజంగానే ఆడియెన్స్ ను ఫిదా అయ్యేలా చేసింది. మెగా బ్రదర్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ కెరియర్ లో మొదటి బిగ్గెస్ట్ హిట్ గా ఫిదా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: