డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ తో పాటు రెండు రాష్ట్రాలలో కూడా పెద్ద సంచలనమైన విషయంగా మారిపోయింది. సినిమా పరిశ్రమ కి సంబందించిన వారిలో ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటున్నారు, పరిశ్రమ కి డ్రగ్స్ సప్లయ్ చేసేది ఎవరు ? లాంటి విషయాలు తేల్చుకోవడం కోసం ఇప్పటికే సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ లు చేస్తోంది. ఈ నేపధ్యం లో హీరో నవదీప్ ని తాజాగా సిట్ బృందం విచారణ చేసిన సంగతి తెలిసిందే.


మనకి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా పరిశ్రమ - డ్రగ్స్ వాడకం కి సంబంధించి నవదీప్ పలు ఆసక్తికర విషయాలు బయట పెట్టాడట. సినిమా రంగం అన్నాక డ్రగ్స్ వాడకం చాలా చిన్న విషయం అనీ దేశం లో బాలీవుడ్ , కాలీవుడ్, శాండల్ వుడ్ ఇలా ప్రతీ సినిమా పరిశ్రమ లో ప్రతీ భాష లో డ్రగ్స్ వాడకం చాలా మామూలు విషయం అని నవదీప్ చెప్పుకొచ్చినట్టు తెలుస్తోంది. పబ్ కల్చర్ అలవాటు ఉన్న ప్రతీ సినిమా వ్యక్తీ డ్రగ్స్ కి మినిమం పరిచయం అయ్యి ఉంటాడు అనీ అది పెద్ద విషయమే కాదు అనీ నవదీప్ చెప్పాడట.


డ్రగ్స్ తీసుకునే హీరోలు, హీరోయిన్ల పేర్లను నవదీప్ సిట్ కు వెల్లడించినట్టు తెలుస్తోంది. సినీ పరిశ్రమలో కొన్నాళ్లుగా ఉన్న హీరోలు డ్రగ్స్ కు బానిసలయ్యారని నవదీప్ సిట్ కు తెలిపాడు. దీంతో నవదీప్ సిట్ విచారణలో ఎవరి పేర్లు చెప్పాడు? అనేది పెద్ద విషయం ఇప్పుడు. నవదీప్ బయట పెట్టిన పేర్ల లో అతను కలిసి యాక్ట్ చేసిన హీరోలు , హీరోయిన్ ల పేర్లు ఉన్నాయి అంటున్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి: