తెలంగాణా - హైదరాబాద్ లో ప్రస్తుతం జరుగుతున్న డ్రగ్స్ కేసు వ్యవహారం లో అందరూ కో ఆపరేట్ చేసి సిట్ విచారణ కి హాజరు అవుతూ ఉండగా చార్మీ తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. సిట్ విచారణకి తాను వెళ్ళను గాక వెళ్ళను అంటూ ఆమె తన న్యాయవాది విష్ణు వర్ధన్ రెడ్డి ద్వారా హై కోర్టు లో పిటీషన్ వేసింది. 15 సంవత్సరాల వయసులోనే సినిమాల్లోకి అడుగు పెట్టిన తనకి మంచి గుర్తింపు వస్తోంది అనేది ఓర్చుకోలేని కొందరు తన మీద అనవసర ఆరోపణలు చేస్తూ తనని బాధపెడుతున్నారు అని ఆమె పిటీషన్ లో పేర్కొంది.


తాను ఒంటరి మహిళనని, తన తల్లిదండ్రులు తనతో ఉండరని, తనకు సహకరించే స్నేహితులు కూడా హైదరాబాదులో లేరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు." నన్ను కుట్ర పూరితంగా ఈ కేసు లో ఇరికించారు. అర్ధం లేని ప్రశ్నలు వేసి నన్ను ఇందులో ఇరికించి నా జీవితం నాశనం చేస్తారు అని నేన్ భయపడుతున్నాను. అందుకే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 22 (1) కింద న్యాయవాది ద్వారా సహాయం పొందే హక్కును కల్పించాలని నేను కోర్టు ని కోరుకుంటున్నాను.


కెరీర్ ఇప్పటికే డౌన్ లో ఉన్న నేను భవిష్యత్తు ని నాశనం చేసుకోలేను. విచారణ టైం లో నా లాయర్ ని నాతో పాటు అనుమతించాలి అని కోరుకుంటున్నాను " అని తన పిటీషన్ లో పేర్కొంది చార్మి. తనకింకా పెళ్లి కాలేదు అనీ తనని కార్నర్ చేసి ఇరికిస్తారు అనే భయం కూడా ఉంది అంటోంది ఆమె 

మరింత సమాచారం తెలుసుకోండి: