మెగా బ్రదర్ తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి మూడేళ్లు గడుస్తుంది. శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్ లో ముకుంద సినిమాతో తెరంగేట్రం చేసిన వరుణ్ తేజ్ ఆ సినిమాతో ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాడు. అయితే మెగా హీరో అన్న బ్రాండ్ తో మొదటి సినినా పాస్ మార్కులతో బయట పడ్డాడు వరుణ్ తేజ్.


ముకుందతో మనసులు గెలిచాడు :


మొదటి సినిమా కోట్ల మంది అభిమానుల ఆశ తండ్రి హీరోగా సక్సెస్ కాలేదు తను మాత్రం కచ్చితంగా సక్సెస్ కొట్టాలన్న కసితో సినిమాలు చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఇక కెరియర్ లో రెండో సినిమానే ఓ పెద్ద ప్రయోగం చేశాడు వరుణ్ తేజ్.


అందరి మెప్పు పొందిన కంచె ప్రయత్నం :


ముకుంద తర్వాత వరుణ్ తేజ్ చేసిన రెండో సినిమా కంచె. క్రిష్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా వరుణ్ గట్స్ అందరికి తెలియచేసింది. లవ్ రొమాంటిక్ యాక్షన్ వీటన్నిటికి దూరంగా వరుణ్ తేజ్ తన కొత్త ప్రయత్నం అందరి ప్రశంసలు పొందేలా చేసింది. అయితే ఆ సినిమా కమర్షియల్ గా మాత్రం సక్సెస్ సాదించలేదు.


మెగా వారసత్వం అంటే మాస్ ఇమేజ్ :


మెగా బ్రాండ్ కున్న మాస్ ఫాలోయింగ్ అందరికి తెలిసిందే. అందుకే రోడ్ సైడ్ గాయ్ గా పూరి జగన్నాధ్ డైరక్షన్ లో లోఫర్ సినిమా చేశాడు వరుణ్ తేజ్. పూరి మార్క్ సినిమాగా వచ్చిన ఈ సినిమా వరుణ్ కెరియర్ లో డిజాస్టర్ గా నిలిచింది. 


అయితే అందులో వరుణ్ తేజ్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తల్లి సెంటిమెంట్ తో వచ్చిన ఆ సినిమా ఫలితం వరుణ్ తేజ్ ను అసంతృప్తి పరచింది.


మిస్టర్ కూడా నిరాశే :


ఒకప్పుడు స్టార్స్ తో సినిమాలు తీసిన శ్రీనువైట్ల ఫ్లాపుల బాట పట్టాడు. అయితే ఈ క్రమంలో వరుణ్ తేజ్ తో కలిసి మిస్టర్ సినిమా తీశాడు. ట్రైలర్ టీజర్ లావణ్య, హెబ్భా లాంటి అందాల భామలతో కనిపించినా సినిమా నిరాశ పరచింది.


ఇక ఆ సినిమాతోనే పార్లర్ గా శేఖర్ కమ్ముల ఫిదా మూవీ చేశాడు వరుణ్ తేజ్.. ఇక ఫిదా మూవీ వరుణ్ కెరియర్ లో ఓ మంచి హిట్ గా నిలిచింది.


ఫిదా తో హిట్ కిక్ :


శేఖర్ కమ్ముల అనామిక తర్వాత ఆయనతో సినిమా అంటే కాస్త ఆలోచించాల్సిందే. అయినా సరే కెరియర్ లో పెద్ద రిస్క్ చేసి మరి ఫిదా మూవీ చేశాడు వరుణ్ తేజ్. ఫిదా మూవీ రిజల్ట్ మీదే వరుణ్ తేజ్ కెరియర్ ఆధారపడి ఉంది. అందుకే సినిమాలో తన లుక్ దగ్గర నుండి అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. 


ముఖ్యంగా ఫిదా హిట్ లో ఎక్కువ భాగం హీరోయిన్ సాయి పల్లవికే క్రెడిట్ దక్కినా మొత్తానికి ఐదో సినిమాకు వరుణ్ తేజ్ హిట్ కిక్ ఎంజాయ్ చేస్తున్నాడన్నమాట. 
ప్రస్తుతం స్టార్ సినిమా కన్నా కంటెంట్ తో కూడా ఎంటర్టైనర్ సినిమాలకే ఆడియెన్స్ హిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో రీసెంట్ గా వచ్చిన శేఖర్ కమ్ముల ఫిదా ఏ, బి,సి సెంటర్స్ అనే తేడాలేకుండా మంచి వసూళ్లతో దూసుకెళ్తుంది.


కచ్చితంగా ఇలాంటి హిట్ కోసం ఐదు సినిమాల దాకా ఎదురుచూసిన వరుణ్ తేజ్ హిట్ ఇచ్చే మజా ఎలా ఉంటుందో రుచి చూశాడు కాబట్టి ఇక నుండి కథల మీద మరింత ఫోకస్ పెడతాడని ఆశించవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: