ఈ మధ్య ముంబై లో జరిగిన ఒక పబ్లిక్ షో లో తెలుగు డైరెక్టర్ , లెజెండ్ రాఘవేంద్ర రావు ని తక్కువ చేసి మాట్లాడింది అంటూ హీరోయిన్ తాప్సీ మీద మనవాళ్ళు విపరీతంగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఆమె మీద ట్విట్టర్ లో ' షేం ఆన్ తాప్సీ ' అంటూ రకరకాల హాష్ టాగ్ లు కూడా ట్రెండ్ చేసారు తెలుగు సినిమా ప్రేమికులు. ఆ వీడియో లో " నా మొదటి దర్శకుడు న బొడ్డు మీద కొబ్బరికాయ తో కొట్టే సీన్ ఒక సినిమాలో పెట్టారు. కొబ్బరికాయ లో కూడా కామం ఉంటుంది అని నాకు ఆ రోజే తెలిసింది.


జయ ప్రద , శ్రీదేవి లాంటి వారిని లాంచ్ చేసి వారికి సూపర్ కెరీర్ ఇచ్చిన ఆ డైరెక్టర్ ఆ రకంగా నా బొడ్డు ప్రాంతాన్ని వాడడం చాలా హాస్యాస్పదం " అంటూ ఆమె ఒక పబ్లిక్ షో లో చెప్పడం అక్కడి వారు పడీ పడీ నవ్వడం తెలుగు వారికి నిజంగా కోపాన్ని తెప్పించింది. దానిమీద ఆమె ఎన్ని రకాలుగా సారీ చెప్పినా మనోళ్ళు ఎక్కడా క్షమించే పరిస్థితి లో లేరు . ఐనప్పటికీ ఆమె వివరణ మాత్రం ఇస్తూనే ఉంది. తాజాగా విడుదల చేసిన క్షమాపణ వీడియో లో " ఆ బిట్ మొత్తం చూడకుండా కేవలం 10 సెకన్లు ఎడిట్ చేసి నేను ఆయనని ఏదో అనేసాను అన్నట్టు మాట్లాడుతున్నారు.


మొత్తం వీడియో దయచేసి చూడండి. నా మీద తప్పుడు ప్రచారం ఆపండి.ఓ గ్లామర్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు నేను తెలుసు. పూర్తిగా నా మాటలు విన్న తరవాత మాట్లాడండి " అంటూ కొత్త వీడియో విడుదల చేసింది ఆమె. " ఇప్పటికే ఈ విషయం మీద రాఘవేంద్రరావు ని కలిసి క్షమాపణలు కూడా చెప్పాను. ఆయన అసలు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆయన కూడా తనను ఆశీర్వదించారు. " అంది తాప్సి 

మరింత సమాచారం తెలుసుకోండి: