తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ షో లో రోజు రోజుకీ ఆదరణ పెరిగిపోతుంది.  ఈ షో మొదలైన ఒకటీ రెండు రోజులు పెద్దగా ఇంట్రెస్ట్ గా కొనసాగకపోవడంతో చాలా మంది విమర్శించారు. కానీ బిగ్ బాస్ షో లో కంటెస్ట్ ల మద్య చిన్న చిన్న తగాదాలు.. బుజ్జగింపులు, కోపాలు మొదలయ్యాయి..దీంతో షో పై ప్రేక్షకులకు క్యూరియాసిటీ పెరగడం మొదలైంది.  ఇక బిగ్ బాస్ షో లో మొదటి వారం బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ ని అనూహ్యంగా కెప్టెన్ అయ్యారు.  
Image result for big boss telugu
కానీ మూడు రోజుల తర్వాత అతడి పర్ఫామెన్స్ ఏమాత్రం నచ్చక బిగ్ బాస్ కెప్టెన్సీ నుంచి తొలగించాడు.  సంపూ ప్లేస్ లో కెప్టెన్ గా సింగర్ కల్పన ఎంట్రీ ఇచ్చారు.  ఇక అప్పటి నుంచి బిగ్ బాస్ హౌజ్ సభ్యులకు కష్టాలు మొదలయ్యాయనే చెబుతున్నారు.   అంతే కాదు బిగ్ బాస్ కెప్టెన్‌గా కొనసాగుతున్న కల్పన వ్యవహార శైలిపై కొందరు ఇంటి సభ్యులు మండి పడుతున్నారు.  
Image result for big boss telugu
పనులు చేయించే విషయంలో ఆమె చాలా కఠినంగా వ్యవహరిస్తోందని, తాము పనులు చేస్తున్నా సరిగా చేయడం లేదంటూ టార్చర్ పెడుతోందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.  ఇక ఈ విషయంతో అంటే టాయిటెట్ క్లీనింగ్ సరిగా చేయలేదని ముమైత్ ఖాన్ పై కాస్త సీరియస్ గా నే క్లాస్ పీకింది కల్పన. దీంతో  ముమైత్ ఖాన్ మిగతా టీమ్ సభ్యుల వద్దకు వచ్చి బాగా ఏడ్చింది.
Image result for big boss telugu
గతంలో తాను హాస్టల్ లో ఉన్నపుడు ఇలాంటి టార్చర్ అనుభవించానని ఇప్పుడు అదే గుర్తుకు వస్తుందని..ఎక్కి ఎక్కి ఏడ్చింది.  కెప్టెన్ కల్పన తీరు తనను బాధించిందని, ఆమె వల్ల ఇక్కడ హాస్టల్ కంటే దారుణంగా పరిస్థితులు తయారయ్యాయని కన్నీరు మున్నీరు అయ్యంది. దీంతో ఇంటి సభ్యులు ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేశారు.
Image result for big boss telugu mumaith khan crying
అంతే కాదు కెప్టెన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కల్పన పూర్తిగా మారిపోయారని..వచ్చిన కొత్తలో అందరికీ తానే దగ్గరుండి పనులు చూసుకునేదని..ఇప్పుడు ఆర్డర్స్ ఇవ్వడం..గట్టిగా మాట్లాడటం ఎవ్వరూ జీర్ణించుకోలేక వామ్మో కెప్టెన్ ఇంత కఠినంగా వ్యవహరిస్తారా అంటు చెవులు కొరుక్కుంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: