తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున సరసన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘సూపర్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క అతి తక్కువ కాలంలో అగ్ర హీరోల సరసన నటించి నెంబర్ వన్ హీరోయిన్ గా వెలిగిపోయింది.  ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్.  ఇక బాహుబలి చిత్రంతో ఏకంగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.  

Image result for anushkha

ఈ మద్య సినీరాజ‌కీయ ప్ర‌ముఖుల గ‌త జ‌న్మ‌ల విశేషాలు చెబుతూ సంచ‌ల‌నంగా మారుతున్నారు ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వీ నాగనాథ్. సెల‌బ్రెటీలు గ‌త జ‌న్మ‌లో ఎక్క‌డ ఏ రూపంలో జ‌న్మించారు? ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర్కున్నారు? ఎలా చ‌నిపోయారు? అనే విష‌యాల‌ను తెలుపుతూ ఎస్వీనాగ్‌నాథ్ చేస్తున్న ప్రొగ్రాం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్టీఆర్, పవన్ కళ్యాన్, అల్లు అర్జున్, రాజమౌళి, వైఎస్ జగన్ ల గత జన్మల గురించి వివరించారు. తాజాగా ఎస్వీ నాగనాథ్ అందాల బొమ్మాళి అనుష్కకు సంబంధించిన గత జన్మ రహస్యాలు చెప్పారు.  

Image result for anushkha

పూర్వ జ‌న్మ‌లో అనుష్క ర‌ష్యాలో జ‌న్మించింద‌ని అస్ట్రో సైకాల‌జిస్ట్ నాగ్‌నాథ్ తెలిపారు. అప్ప‌ట్లో ఆమె అపురూప సౌంద‌ర్య‌వ‌తి అని చెప్పారు. ఈ దేవ‌సేన పూర్వజ‌న్మ జాత‌కంలో అనేక ఎత్తుప‌ల్లాలు జ‌రిగాయ‌ట‌. అందంతో కూడిన అహంకారం ఆమె జీవితాన్నే మార్చేసింద‌ని చెప్పారు. త‌న‌కంటూ 20 ఏళ్లు పెద్ద వ్య‌క్తి అయిన ఓ క‌ళాకారుడిని పెళ్లాడింద‌ట‌. ఆ జ‌న్మ‌లో అనుష్క‌కు పిల్ల‌లు లేరట‌. అనారోగ్య స‌మ‌స్యల‌తోనే అనుష్క గ‌త జ‌న్మ ముగించింద‌ట‌. అప్ప‌టి ప‌రిస్థితుల ప్ర‌భావం వ‌ల్ల ఆమె లైఫ్‌లో ఊహించ‌ని అనేక ప‌రిణామాలు జ‌రిగిన‌ట్టు నాగ్‌నాథ్ తెలిపారు. 


సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులంద‌రి పాస్ట్ లైఫ్ ఎపిసోడ్‌ల‌తో ఈ కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని, ప్ర‌తి వారం ఒక ఎపిసోడ్ ప్ర‌సార‌మ‌వుతుంద‌ని ప్రొగ్రామ్ డైరెక్ట‌ర్ స్వామి ముద్దం తెలిపారు. తాజాగా ప్ర‌సారం చేసిన అనుష్క‌ పాస్ట్ లైఫ్ వీడియోకు విశేష స్పందన వస్తోందని చెప్పారు. సెల‌బ్రెటీల పాస్ట్ లైఫ్‌ల‌ను ఆవిష్క‌రించే ఇలాంటి కార్య‌క్ర‌మం మీడియా చ‌రిత్ర‌లో తొలిసార‌ని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: