సెప్టెంబర్ నెలలో దసరా రేస్ కు రాబోతున్న ‘జై లవ కుశ' పై ఈ సినిమాను కొనుక్కున్న బయ్యర్లకే కాకుండా జూనియర్ అభిమానులకు  కూడ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రావణాసురిడిని బేస్  చేసుకుని మలచిన ‘జై’ క్యారక్టర్ ఈసినిమా ఘనవిజయంలో కీలకపాత్ర పోషిస్తుంది అన్న అంచనాలు ఉన్నాయి.   

ఇప్పటికే ఈమూవి టీజర్ రికార్డులను చూసి సంబరపడుతున్న జూనియర్ అభిమానులకు ఈసినిమాకు సంబంధించి ఒక నెగిటివ్ సెంటిమెంట్ భయ పెడుతున్నట్లు టాక్. నిన్న ఈమధ్య ఈ సినిమాకు సంబంధించి లీక్ అయిన వర్కింగ్ స్టిల్స్ లో ఎన్టీఆర్ ‘సమ సమాజ్ పార్టీ' అనే పార్టీకోసం పనిచేసే నాయకుడిగా కనిపించనున్నాడని అర్ధమైపోయింది. 

కాని ఇప్పుడు ఆ విషయమే జూనియర్ అభిమానులకు నెగిటివ్  సెంటిమెంట్ ను గుర్తుకు చేస్తోంది అని అంటున్నారు. గతంలో ఎన్టీఆర్   ఈ పొలిటికల్ టచ్ ఉన్న రోల్స్ లో నటించినా లేదంటే ఏదన్నా సినిమాలో పొలిటికల్ పంచులు పేల్చినా కూడ అవన్నీ వర్కవుట్ కాలేదుఅన్న సెంటిమెంట్ ఉంది. 

పూర్తి స్థాయి పాలిటిక్స్ తో వచ్చిన ‘నాగ’ కాస్త కాస్త పొలిటికల్ పంచులు పేల్చిన ‘దమ్ము' 'రామయ్యావస్తావయ్యా' సినిమాలన్నీ దారుణమైన ఫ్లాపులుగా మారాయి. అసలు ఎన్టీఆర్ పాలిటిక్స్ టచ్ చేస్తే చాలు ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అన్న భయంకరమైన సెంటిమెంట్ ఉంది. ‘ఈ సైకిల్ మీద వచ్చి చాలామంది చరిత్ర సృష్టించారు’ అంటూ డైలాగ్ చెప్పినా ‘కంత్రి' సినిమా సక్సస్స్ కాలేదు అనేది జూనియర్ అభిమానుల భయం.   

దీనితో  జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ పాలిటిక్స్ ను టచ్ చేస్తున్నాడు అనే వార్తలు రావడంతో జూనియర్ అభిమానులు భయపడుతున్నారు. అయితే జూనియర్ అభిమానులలోని మరొక వర్గం వ్యక్తం చేస్తున్న అభిప్రాయాల ప్రకారం ఈ విషయాలు అన్ని ఒక సెంటిమెంట్ మాత్రమే అని తీసిపారవేస్తూ ‘జై లవ కుశ' వచ్చేవరకు అసలు ఈ పొలిటికల్ డైలాగులు ఎందుకు పెట్టారో ఆన్న విషయమై క్లారిటీ రాదు అని అంటున్నారు. అయితే బయటకు వస్తున్న ఈ సెంటిమెంట్ వార్తలు మటుకు ‘జై లవ కుశ’ ను భారీ మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్లు మాత్రం ఈ సెంటిమెంట్ వార్తలు విని తెగ ఖంగారు పడుతున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: