డ్రగ్స్ కేసు విచారణలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి అకున్ సభర్వాల్. డ్రగ్స్ కేసు విచారణకు సంబంధించి ఛార్మీ వేసిన పిటిషన్ పై కోర్టు తీర్పు తర్వాత కమిషనర్ చంద్రవదన్ తో కలిసి అకున్ సబర్వాల్ మీడియాతో ముచ్చటించారు. 

ఛార్మీ అనవసరంగా కోర్టుకు వెళ్లిందని వారిద్దరూ అభిప్రాయపడ్డారు. ఆమెను మేము నిందితురాలు అని ఎక్కడా పేర్కొనలేదని.. డీటెయిల్స్ తెలుసుకోవడానికి పిలిస్తే ఆమె కోర్టుకెళ్లిందన్నారు. కోర్డుకు వెళ్లడం ద్వారా తాను నిందితురాలినేనని ఆమె ఒప్పుకున్నట్లయిందని చెప్పారు. ఆమాటకొస్తే తాము ఎవరినీ నిందితులుగా చూడలేదన్నారు.

 Image result for tollywood drugs

        అకున్, చంద్రవదన్ చిట్ చాట్ లో అన్నిటకంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే... విచారణకు వస్తున్నవాళ్లంతా అలోవీరా జూస్ తాగి వస్తున్నారంట. తద్వారా కడుపు మొత్తం క్లీన్ చేసుకుని వస్తున్నారని వారు చెప్పారు. అందుకే నార్కొటిక్ పరీక్షతో పాటు ఢిల్లీ నుంచి అథ్లెటిక్ డోప్ టెస్టింగ్ మెషీన్ ను తెప్పించి పరీక్ష చేయాలని నిర్ణయించినట్టు వివరించారు.

 Image result for tollywood drugs

        డ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయిందని.. ఆంధ్ర, తెలంగాణ ఫీలింగ్ తీసుకొస్తున్నారని కమిషనర్, డైరెక్టర్ అభిప్రాయపడ్డారు. అంతేకాక.. విచారణకు హాజరవుతున్న వారు కొత్త కొత్త పేర్లు చెబుతున్నారని.. అందులో బడా హీరోలు, నిర్మాతలు కూడా ఉన్నారన్నారు. అయితే వీళ్లు చెప్పిన మాటల ఆధారంగా వారికి నోటీసులు ఇవ్వలేమన్నారు. ఆధారాలు దొరికినప్పుడు తప్పకుండా వాళ్లకు నోటీసులు ఇస్తామన్నారు. విచారణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేస్తున్నట్టు వివరించారు. ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు అందిస్తున్నామని, ఇంటెలిజెన్స్ కూడా దీనిపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టిందని వారు వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: