‘బిగ్ బాస్’ షోకు రేటింగ్స్ ఎలా వస్తున్నా ఇందులోని పార్టిసిపెంట్లు ఈ కార్యక్రమం చూస్తున్న బుల్లితెర ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నా వారాంతంలో ఎన్టీఆర్ రాగానే ఈ షో మళ్లీ పుంజుకుంటూ ఉండటంతో ‘బిగ్ బాస్’ షో అంతా జూనియర్ వన్ మ్యాన్ షోగా మారిపోయింది అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఈ కామెంట్స్ మాత్రం మెగా అభిమానులకు ముఖ్యంగా చిరంజీవి అభిమానులకు ఏమాత్రం రుచించడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి. 

‘బిగ్ బాస్’ షోకి సంబంధించి ఎన్టీఆర్ తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఎనర్జీతో వాక్చాతుర్యంతో  సందర్భోచిత హాస్యంతో ఈషోను రక్తి కట్టిస్తున్నాడు అని ప్రశంసలు రావడం చిరంజీవి అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నట్లు టాక్. దీనికికారణం మెగాస్టార్ గా 35 సంవత్సరాలు టాలీవుడ్ ను షేక్ చేసిన చిరంజీవి బుల్లితెర పై తన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో ద్వారా ఫెయిల్ అయ్యాడు అన్న కామెంట్స్ రావడం ఇప్పటికీ చిరంజీవి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు అని టాక్. 

‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోను హోస్ట్ చేయడంలో చిరంజీవి పడ్డ ఇబ్బంది అంతా ఇంతా కాదు. వెండితెర పై చిరంజీవి తనచక్కటి  స్క్రీన్ ప్రెజెన్స్‌తో చెలరేగి పోయినా బయట మాత్రం అంత ఫ్రీగా ఉండలేడు అన్న కామెంట్స్ ఉన్నాయి. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ విషయంలోనూ ఆయన ఆరంభం నుంచి ఇదే ఇబ్బంది పడినట్లు విమర్శకుల భావన. సందర్భోచిత హాస్యం పండించలేకపోవడం తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో షోను నడిపించాలని చూడటం చిరంజీవి కోటీశ్వరుడు షోకు గతంలో శాపంగా మారింది అన్న కామెంట్స్ ఉన్నాయి. 

అందువల్లనే ఈ షోకు తక్కువ రేటింగ్స్ వచ్చాయి అన్న విశ్లేషణలు ఉన్నాయి. అయితే దీనికి భిన్నంగా ఇప్పుడు ఎన్టీఆర్ ‘బిగ్ బాస్’ను రక్తి కట్టిస్తుండటంతో చిరంజీవి అభిమానులకు ఆ విషయం అసహనంగా మారింది అని అంటున్నారు. జూనియర్ కు ఉన్న జ్ఞాపకశక్తి ‘బిగ్ బాస్’ షోకు వరంగా మారింది అని అంటున్నారు. 

‘బిగ్ బాస్’కు సంబంధించిన స్క్రిప్టును చక్కగా గుర్తుపెట్టుకోవడమే కాకుండా సందర్భోచితంగా అప్పటికప్పుడు మాటలు మారుస్తూ స్పాంటేనియస్‌ గా వినోదాన్ని పంచే విషయంలో జూనియర్ ప్రదర్శిస్తున్న సమయస్పూర్తి కోటీశ్వరుడు షో విషయంలో చిరంజీవి ప్రదర్శించ లేకపోయాడు అని కామెంట్స్ ఇప్పుడు రావడం చిరంజీవి అభిమానులకు బయటకు చెప్పుకోలేని అవమానంగా మారింది అని అంటున్నారు. వాస్తవానికి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోలాగే ‘బిగ్ బాస్’ షో కూడ అందర్నీ మెప్పించలేకపోయినా బుల్లితెర పై చిరంజీవికి రాని ఇమేజ్ జూనియర్ కు రావడం మెగా అభిమానులకు అసహనాన్ని కలిగిస్తోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: