ఒకప్పటి లాగా గ్లామర్ కి మాత్రమె పరిమితం అవ్వకుండా బోల్డ్ పాత్రల్లో చెయ్యడానికి హీరోయిన్ లు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాస్తంత ధైర్యం చేసి కొన్ని కొన్ని పొగరు యాటిట్యూడ్ లు చూపిస్తే చాలు డిఫరెంట్ హీరోయిన్ అనే పేరుతో పాటు ఆ పాత్ర క్లిక్ అయితే అవార్డు, మెచ్చుకోళ్ళు కూడా మన వెంట పడతాయి కదా అనే మైండ్ సెట్ లో ఉంటున్నారు కొందరు హీరోయిన్ లు.


ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్ లు అందరూ తెర మీద మందు కొట్టడం , దమ్ము లాగడం లాంటి వ్యవహారాల విషయం లో చాలా తెలివిగా నడుచుకుంటున్నారు. నేనే రాజు నేనే మంత్రి సినిమాలో హీరోయిన్ క్యాతరీన్ ఫుల్లుగా దమ్ము కొడుతూ కనిపించింది ట్రైలర్ లో. ఈ సినిమాలో కాజల్ మెయిన్ హీరోయిన్ కాగా ముఖ్య పాత్ర లో క్యాథరీన్ కూడా కనిపిస్తోంది.


ఆమె పాత్ర నెగెటివ్ లక్షణాలు ఉన్నది కావడం తో దమ్ములాగాల్సి వచ్చింది అని ఆమె చెప్పుకోస్తోంది. ఈ సినిమాకి సంబంధించి ఇచ్చిన ఇంటర్వ్యూ లలో ఆమె తన విషయాలు అన్నీ బయట పెట్టింది. ”స‌న్నివేశం అలాంటిది. అందుకే సిగ‌రెట్‌కాల్చాను. అయితే నిజ జీవితంలో మాత్రం సిగ‌రెట్ తాగింది లేదు. అమ్మాయిలు సిగ‌రెట్లు కాల్చితే న‌చ్చ‌దు. తెర‌పై కాబ‌ట్టి పాత్ర ప‌రిధి మేర‌కు న‌టించ‌డంలో త‌ప్పు లేదు” అని చెబుతోంది. ఈ వారం విడుద‌ల కాబోతున్న ‘గౌత‌మ్ నంద‌’లోనూ కేథ‌రిన్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఆ సినిమాకీ నేనే రాజు నేనే మంత్రి విడుదల కి పెద్ద గ్యాప్ లేకపోవడం విశేషం 

మరింత సమాచారం తెలుసుకోండి: