డ్రగ్స్ కేసులో తన విచారణ కి సంబంధించి హై కోర్టుకి ఎక్కిన ఛార్మి కి హై కోర్టు సగం సంతోషం సగం ఆశ్చర్యం అందించింది. ఆమె కోరుకున్నట్టు తన లాయర్ ని ఆమె ఇన్వెస్టిగేషన్ రూమ్ లోకి పంపడం కుదరదు అని తేల్చేసిన కోర్టు ఒక ప్రత్యేక మహిళా అధికారితో చార్మీ విచారణ సాగాలి అని తీర్పు చెప్పింది. దీనికి సంబంధించి అకున్ సబర్వాల్ ఒకరు కాదు ఏకంగా నలుగురు మహిళా అధికారులని నియమించినట్టు మీడియాకి , కోర్టు కీ తెలిపారు.


ఓ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ స్థాయి అధికారిణితో పాటు మరో ముగ్గురు మహిళా సీఐలు ఈ బృందంలో ఉంటారు. అయితే, గతంలో నార్కోటిక్స్ కేసులో అనుభవమున్న మహిళా సీఐ ధనలక్ష్మి, ప్రధానంగా చార్మిని ప్రశ్నిస్తున్నారు. ఆమె ఉదయం పైసా వసూల్ సినిమా షూటింగ్ కి వెళ్లి అటునుంచి అటు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు.


ఈ సిట్ కార్యాలయం లో నలుగురు మహిళా అధికారులు ఉదయమే వచ్చి చార్మికి సంబందించిన వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలు, సంధించాల్సిన ప్రశ్నల గురించి సమాచారాన్ని తెలుసుకున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకే చార్మీ విచారణ సాగాలి అని కోర్టు తీర్పు చెప్పింది  

మరింత సమాచారం తెలుసుకోండి: