మలయాళీ మాయలేడి సమంత బెడ్ రూమ్ లో పంచ్ డైలాగ్ స్పెసలిస్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూర్చొని ఉన్న ఫోటో ఇప్పుడు వెబ్ మీడియా లో తెగ హడావుడి చేస్తోంది. అయితే ఇందులో ఏదో వేరే అర్ధం ఉందని ఎవరూ ఖంగారు పడకండి. ఈ స్టిల్ ఈ రోజు పాటలు విడుదల కాబోతున్న ‘అత్తారింటికి దారేది’ సినిమా షూటింగ్ లో ఒక బెడ్ రూమ్ సన్నివేశాన్ని సమంత కు త్రివిక్రమ్ వివరిస్తున్నప్పుడు తీసిన ఫోటో ఇది. పవన్ కళ్యాణ్ తో సమంత, ప్రణీత లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ముగించుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

సినిమా విడుదల కాకుండానే ఈ సినిమా నిర్మాత ప్రసాద్ కు 20 కోట్ల టేబుల్ ప్రోఫిట్ ఈ సినిమా ద్వారా వచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకూ ఏ సినిమాలోనూ కనిపించనంత అందంగా పవన్ ఈ సినిమాలో రకరకాల టీ-షర్ట్స్ తో చాలా అందంగా కనిపిస్తాడని టాక్. పవన్ కు గతంలో నటించిన ఏ హీరోయిన్ తోనూ కుదరని కెమిస్ట్రీ, ఈ సినిమాలో సమంత తో చాలాబాగా సెట్ అయిందని, ఈ సినిమా రషస్ చూసిన వారు అంటున్నారు. ట్రెండ్ ను సెట్ చేయడమే కానీ ట్రెండ్ ను ఫాలో కానీ పవర్ స్టార్ ఇమేజ్ ఈ సినిమాతో అమ్మాయిలలో కూడా బాగా పెరిగిపోతుంది అని అంటున్నారు. మరి ఈ మేజిక్ వండర్ చూడాలి అంటే మరికొద్ది రోజులు ఓపిక పట్టాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: