డ్రగ్స్ కేసులో ఈరోజు విచారణ నిమిత్తం సిట్ ఆఫీసుకు చేరుకున్న ఛార్మీ సృష్టించిన హంగామా మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ఒక సినిమా ఫంక్షన్ కో లేదంటే ఒక షాప్ ఓపెనింగ్ కు వచ్చే విధంగా ఛార్మీ కొంతమంది బౌన్సర్లతో హడావిడి చేస్తూ సిట్ కార్యాలయానికి రావడం మీడియా కెమెరాల దృష్టిని ఆకర్షించింది.  

ఇది ఇలా ఉండగా ఇప్పటివరకు చాలామంది వైట్ షర్ట్స్ వేసుకుని విచారణకు వస్తే ఛార్మి మాత్రం బ్లూ కలర్ షర్ట్ వేసుకుని ఈ విచారణకు వచ్చి మరో ట్విస్ట్ ఇచ్చింది.   మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఆమెను విచారిస్తున్న మహిళా అధికారులు కెల్విన్ ఫోన్‌లో తన పేరును ‘ఛార్మి దాదా’ గా ఫీడ్ చేసుకోవడం పై అధికారులు ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లు టాక్.

దీనికితోడు ఛార్మీ కెల్విన్‌తో వాట్సాప్‌ చాటింగ్ 1000కి పైగా కాల్స్‌ చేయడం వంటి విషయాలతో పాటు మరిన్ని లోతైన విషయాలను ఎక్సైజ్‌ శాఖకు చెందిన నలుగురు మహిళా అధికారుల బృందం ఛార్మీని గుచ్చిగుచ్చి అడుగుతున్నట్లు టాక్. ఈరోజు జరుగుతున్న విచారణలో ఛార్మీ వైపు నుండి సరైన స్పష్టత రాకపోతే రేపు కూడ ఈమెను
విచారణకు పిలిచే అవకాశం ఉంది అంటూ మరికొన్ని కథనాలు ప్రసారం అవుతున్నాయి.

పూరి జగన్నాథ్ కు ఛార్మీకి ఉన్న సాన్నిహిత్యం రీత్యా ఈరోజు జరుగుతున్న ఈ కీలక విచారణలో అనేక సరికొత్త విషయాలు బయటపడే అవకాశం ఉంది అన్న వార్తలు కూడ వస్తున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం సినిమాలు చేతిలో లేకపోయినా ఛార్మీ మాత్రం మీడియాకు హాట్ టాపిక్ గా మారిపోయింది..  



మరింత సమాచారం తెలుసుకోండి: