తమిళనాడు లో తన అభిమానుల చేత గుడి కట్టించుకొని టాలీవుడ్ లో దేశముదురు ద్వారా ఎంట్రీ ఇచ్చిన హన్సిక, ఆడ దేశముదురులా మారిపొయి౦దని నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు. అటు పెద్ద హీరోలతో ఇటు చిన్న హీరోలతో సామాజిక న్యాయం పాటిస్తూ స్పీడ్ గా సినిమాలు చేస్తున్న హన్సిక ఒక కొత్త పద్ధతి మొదలు పెట్టిందంట. ఈ మార్కెట్ ప్లాన్ విన్న పెద్ద పెద్ద నిర్మాతలు కూడా హన్సిక ఇంత దేశముదురా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

పెద్ద హీరోలతో చేస్తే హన్సికకు 40 నుంచి 50 లక్షలు ఇచ్చినా చాలు అట. అదే చిన్న హీరోలతో అయితే కోటి రూపాయలు కావాలి అంటుందట. పెద్ద హీరోలతో క్రేజ్, చిన్న హీరోలతో సంపాదన. ఇప్పుడు ఇదే హన్సిక టార్గెట్. ఈమధ్యన కోలీవుడ్ హీరో శివ కార్తికేయను హీరో గా చేసి సినిమా తీద్దాం అని హన్సిక దగ్గరకు వెళ్ళితే, సింపుల్ గా కోటి రూపాయలు అయితేనే చేస్తాను అంటూ తెల్చేసిందట ఈ బబ్లీ గర్ల్. ఇక చేసేది లేక ప్రస్తుతం హన్సికకు నడుస్తున్న మహాదశ ను దృష్టిలో ఉంచుకొని ఆ పారితోషికానికి ఒకే చెప్పేశాడట ఆ నిర్మాత. ‘సింగం-2’ హిట్ తో హన్సిక ప్రస్తుతం ఎడాపెడా గణించేస్తూ తమిళంలో 5, తెలుగు లో 2 సినిమాలు చేస్తూ బిజీ గా కాలం గడిపేస్తోంది ఈ కోలీవుడ్ ప్రేక్షకుల అందాల దేవత హన్సిక.

కొస మెరుపు ఏమిటంటే తెలుగులో విజయం సాధించిన ‘కందిరీగ’ సినిమా ను బాలీవుడ్ లో తీస్తున్న నిర్మాతలు మటుకు ఇంత లావు పాటి అమ్మాయి మాకు వద్దు అంటూ కరువుకాలపు సుందరి ఇలియానా నే ఎంచుకున్నారు. ఏది ఏమైనా హన్సిక మొదలు పెట్టిన సామాజిక న్యాయసూత్రం పెద్ద పెద్ద హీరోయిన్స్ ను కూడా ఆశ్చర్య పరచేలా చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: