‘అ ఆ’ మూవీ తరువాత చాల గ్యాప్ తీసుకుని నితిన్ నటిస్తున్న ‘లై’ మూవీ ఆగష్టు 11న విడుదల అవుతుందని ఇప్పటికే ప్రకటించారు. ఈసినిమా ఈసినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ తో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ను కూడ మొదలు పెట్టాలి అన్న వ్యూహాలు రచిస్తున్నారు. 

అయితే అనూహ్యంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది అని గత రెండు రోజులుగా ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్న రూమర్ల వెనుక ఎవరి హస్తం ఉంది అంటూ అప్పుడే నితిన్ తన స్థాయిలో ఎంక్వైరీలు కూడ చేయిస్తున్నట్లు టాక్. ఈమూవీ విడుదల తేదీ ఎప్పుడో ప్రకటించినా అదే డేట్ కు రానా ‘నేనే రాజు నేనే మంత్రి’ బెల్లంకొండ శ్రీనివాస్ ‘జయజయ జానకీ నాయక’ విడుదల కూడ ఫిక్స్ కావడంతో ఆగష్టు 11న మధ్యతరహా సినిమాల వార్ గా మారిపోయింది.

దీనితో ఈ మూడు సినిమాల పై మంచి అంచనాలు ఉన్నా ఒకేసారి ఈ మూడు సినిమాలు విడుదల అయితే ఈ మూడు సినిమాలు నష్టపోతాయి అన్న ప్రచారం జరుగుతోంది. దీనితో ఎవరో పనికట్టుకుని ‘లై’ సినిమా ఆగస్టు 11న రాదని ఫీలర్లు వదుల్తున్నట్లు ఈసినిమా నిర్మాతల దృష్టికి వచ్చినట్లు టాక్.  దానితో ఈ ప్రచారానికి అడ్డుకట్ట వేసే పనిలో ఈమూవీ నిర్మాతలు ప్రస్తుతం బిజీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

తెలుస్తున్న సమాచారం మేరకు  ఈ సినిమా బయ్యర్లను, డిస్ట్రిబ్యూటర్లను కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈసినిమాలో నితిన్ ఒక రహస్య గూఢచారిగా కనిపిస్తాడని తెలుస్తోంది. మేఘనా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా పై కావాలని అబద్ధాలు ప్రచారం చేయడం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: