త్వరలో విడుదల కాబోతున్న ‘జై లవ కుశ’ కోసం చాలా ప్రయోగాలు  చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ మధ్యకాలంలో మన హీరోలు ఒకే సినిమాలో ట్రిపుల్ రోల్స్ చేసిన సందర్భాలు లేవు. గతంలో ఎన్టీఆర్ ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి కమల్ హాసన్ లాంటి టాప్ హీరోలు ఇటువంటి ప్రయోగాలు చేసి సక్సస్స్ అయ్యారు. 

ఇలాంటి ప్రయోగాలు చేసేడప్పుడు ఆ సినిమాలో నటించే హీరో చాల కష్టపడటమే కాకుండా తాను నటించే  ప్రతిపాత్రకు చాలా వైవిధ్యాన్ని చూపెడుతూ చాలా గట్టి హోం వర్క్ చేయాలి. ప్రస్తుతం జూనియర్ ‘జై లవ కుశ’ లో త్రిపాత్రభినయం చేస్తున్న నేపధ్యంలో ఆ ట్రిపుల్ రోల్స్ లో చాలా వైవిధ్యం చూపిస్తున్నట్లు టాక్.  

ప్రస్తుతం పూణెలో ఈ సినిమా తాలూకు పాటను ఒక మహల్ లో షూటింగ్ చేస్తున్నారు. అయితే ఈ పాట కోసం ఎన్టీఆర్ కాస్త గట్టిగా కష్టపడాల్సి రావడమే కాకుండా ఒక రోజైతే ఏకంగా ఒకొక్క క్యారెక్టర్ కోసం షుమారుగా 12 జతలు మారుస్తూ ఒకే రోజులో ఏకంగా 42 రకాల జతలను వేసుకున్నాడట. 

మార్చిన ప్రతీసారి స్టయిలింగ్ కూడా మార్చాలి  కాబట్టి ఆ పాత చిత్రీకరణ పెద్ద ఛాలంజింగ్ గా మారింది అని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ సౌలభ్యం బాగా పెరిగిపోవడంతో ఒకసారి ఒకలా తీసిన షాట్ ను మళ్లీ అదే తరహాలో కెమెరాలో ఎన్నిసార్లైనా రిపీట్ చేయవచ్చు. ఆ మధ్యన అమీర్ ఖాన్ ‘ధూమ్ 2’ కోసం ఇదే తరహాలో చేశాడు. ఇప్పుడు అదే టెక్నిక్ ‘జై లవ కుశ’ కోసం  జూనియర్ అనుసరిస్తున్నాడు అని అంటున్నారు. 

ఇది ఇలా ఉండగా ఈ సందర్భంగా దర్శకుడు బాబీ చేసిన ట్వీట్ జూనియర్ అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ఎన్టీఆర్ డాన్స్ దుమ్ము రేపుతున్నాడు అంటూ పొగడ్తలు గుప్పిస్తూ బాబీ చేసిన ట్వీట్ అభిమానుల్లో ఈ సినిమా పై ఆసక్తి మరింత పెంచేలా చేసింది. ‘ఎన్టీఆర్ మన కళ్ల ముందు డ్యాన్స్ చేస్తుంటే చూడటం నమ్మశక్యం కాని అనుభం’ అంటూ బాబీ చేసిన ట్విట్ జూనియర్ అభిమానులకు మంచి జోష్ ను ఇస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: