యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా స్టార్ లో వస్తున్న అత్యంత భారీ రియాలిటీ షో బిగ్ బాస్. 14 మంది యావరేజ్ కంటెస్టంట్స్ తో తారక్ చేస్తున్న ఈ ప్రయత్నం ప్రేక్షకుల నుండి మిక్సెడ్ రెస్పాన్స్ అందుకుంది. షో మొదలైన తారు అందరిని ఉత్సాహంలో నింపగా ఆ తర్వాత హౌజ్ మెట్స్ మధ్య అంతా సాన్నిహిత్యం లేకపోవడంతో మొదటి వారం నీరసంగా సాగింది.  


వారం ముగిసి తారక్ వచ్చే సరికి మళ్లీ ప్రోగ్రాం మీద ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. అప్పటిదాకా నీరసంగా సాగుతున్న షో కాస్త జోష్ ఫుల్ గా మారింది. ఇక కంటెస్టంట్స్ మధ్య గొడవలు ఎలా ఉన్నా రియాలిటీ షో అంటే ఆ రేంజ్ కు తగ్గట్టే చేస్తున్నారు. ఇక ఈరోజు వచ్చిన టి.ఆర్.పి రేటింగ్స్ లో స్టార్ మా ను మొదటి స్థానంలో నిలబెట్టింది బిగ్ బాస్.


బిగ్ బాస్ షోకి అత్యధికంగా 16.18 టి.ఆర్.పి రేటింగ్స్ రావడం విశేషం. మా టివి కాస్త స్టార్ మా అయిన తర్వాత 2017లో ఈ రేంజ్ టి.ఆర్.పి అందుకోవడం ఇదే మొదటిసారి. సో ఈ లెక్కన చూస్తే తారక్ బిగ్ బాస్ సూపర్ హిట్ అన్నట్టే లెక్క. కేవలం సినిమాల్లోనే కాదు బుల్లితెర మీద కూడా తారక్ ఇచ్చిన పాత్రకు నూటికి నూరు పాళ్లు న్యాయం చేస్తాడు అన్న విషయం బిగ్ బాస్ చూస్తే అర్ధమవుతుంది. 


కచ్చితంగా ఈ రేటింగ్ ఇచ్చిన ఉత్సాహం చూస్తుంటే స్టార్ మా ఇలాంటి క్రేజీ రియాలిటీ షోస్ ను ఇంకా బుల్లితెర ఆడియెన్స్ కోసం ప్రయత్నిస్తారని చెప్పొచ్చు. బిగ్ బాస్ సీజన్ 1కి తారక్ హోస్ట్ గా చేస్తున్నాడు అయితే ఎన్.టి.ఆర్ నే సెకండ్ సీజన్ కు హోస్ట్ గా ఉంచుతారా లేక వేరే ఎవరైనా హోస్ట్ బాధ్యతలను తీసుకుంటారా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: