తెలుగు రాష్ట్రాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే హాట్ టాపిక్..అదే టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం.  ఇప్పటికే పూరి, సుబ్బరాజు,తరుణ్,నవదీప్,శ్యాంకె.నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, చార్మి సిట్ ముందు హాజరు కాగా నేడు నటి ముమైత్ ఖాన్ విచారణకు హాజరయ్యారు.  ఇక డ్ర‌గ్స్ కేసులో టాలీవుడ్ పై ఫోకస్ చేయడంపై పలువురు సినీ ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు..అందులో ఒకరు సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మ.  
Image result for tollywood drugs
ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రాంగోపాల్ వర్మ ఈ సారి  డ్రగ్స్ వ్యవహారంలో జరుగుతున్న దర్యాప్తుపై మరోసారి విరుచుకు పడ్డాడు.   డ్రగ్స్ విచారణ అంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలోని కొంతమందిని విచారిస్తున్న తీరుతో మొత్తం తెలంగాణా ప్రతిష్టకే భంగం కలిగిందని విమర్శించాడు. పంజాబ్ స్కూల్స్‌లో జరుగుతున్నట్లుగానే తెలంగాణ, హైదరాబాద్ స్కూళ్లలో డ్రగ్స్ వ్యవహారం జరుగుతోందని  దేశవ్యాప్తంగా భావిస్తున్నారు.
Image result for tollywood drugs
 ప్రస్తుతం డ్రగ్స్ విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే..తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా ఉందని అన్నారు. మరో వైపు వర్మ డ్రగ్స్‌పై ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని వర్మ తప్పుపట్టాడు.  అంతే కాదు సిగరెట్‌, ఆల్కహాల్‌లాగానే డ్రగ్స్‌ను కూడా చట్టబద్ధం చేస్తే తప్పేంటి అని సోషల్‌ మీడియా ద్వారా ప్రశ్నించారు.
Image result for tollywood drugs
వీటి వల్ల ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందో..తెలుసు అందుకే అంతగా ప్రోత్సహిస్తున్నారు. మరి ప్రభుత్వం డ్రగ్స్‌ను మాత్రం చట్టవిరుద్ధంగా ఎందుకు చూస్తోంది. డ్రగ్స్‌ను కూడా చట్టబద్ధం చేయవచ్చు కదా అన్నారు. 

కేసీఆర్‌కున్న మంచి పేరును చెడగొట్టేలా

చట్టబద్ధం చేస్తే తప్పేంటి?


మరింత సమాచారం తెలుసుకోండి: