తెలుగు టెలివిజన్ రంగంలోనే బిగ్ రియాల్టీ షో 'బిగ్‌బాస్' సంచలనం రేపుతోంది. బుల్లితెరపై జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌‌గా వ్యవహరిస్తున్న ఈ షో అదుర్స్ అంటున్నాయి తాజా రేటింగ్స్. అయితే వారం అంతా ఈ కార్యక్రమం జోష్ లేకుండా కొనసాగుతున్న కార్యక్రమానికి వారాంతంలో ఎన్టీఆర్ ఏదో మాయ చేస్తున్నాడు. తమిళ 'బిగ్‌ బాస్' మాదిరిగా ఎలాంటి సంచలనాలు లేకుండా నడుస్తున్న ఈ కార్యక్రమానికి దుమ్మురేపే విధంగా టీఆర్సీ రావడం షో నిర్వాహకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 


'బిగ్‌బాస్' బిగినింగ్‌లో అంద‌రిని బాగానే ఆకట్టుకొన్నది. ఆ తర్వాత ఏడుపులు, అలకలతో తెలుగు టీవీ సీరియల్‌ను మించిపోయింది. వారం రోజులు విసుగు తెప్పించే విధంగా ఉందనే ఫీలింగ్ కలిగే సమయంలో వారాంతంలో ఎన్టీఆర్ రంగంలోకి దూకాడు. తన మాటలతో గారడీ చేశాడు. అంద‌రిలోనూ ఒక్క‌సారిగా జోష్ పెంచాడు. దాంతో అనూహ్యంగా స్టార్ మా చానల్ రేటింగ్ టాప్‌లోకి దూసుకెళ్లింది. 


స్టార్ మా టీవీ ప్రకటించిన ప్రకారం 'బిగ్‌బాస్' కార్యక్రమంతో టీఆర్ఫీ 16.18గా నమోదైంది. ఇటీవల కాలంలో ఒక చానల్‌కు ఇంత రేంజ్‌లో రేటింగ్ రావడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు నాలుగో స్థానంలో ఉన్న స్టార్ మా బిగ్‌బాస్ షో రియాలిటీ షో ప్రారంభమైన తర్వాత మొదటి స్థానానికి ఎగబాకడం రికార్డుగా చెప్పుకొంటున్నారు. నిజానికి 'బిగ్‌బాస్' ఇంటిలో సభ్యులు మధ్య కలహాలు, కోపతాపాల్లాంటి ఘటనలతో అతి మాములుగా నడుస్తున్న 'బిగ్‌బాస్‌' కార్యక్రమం వెంటిలేటర్ మీదకు చేరుతుందా అనే భావన వచ్చే సమయంలోనే కిక్కు ఇచ్చే ఇలాంటి రేటింగ్ రావడంతో నిర్వాహకులకు ఫుల్ జోష్ వ‌చ్చింది.


ఎన్టీఆర్ కనపడని రోజుల్లో 10.4 టీఆర్పీ రేటింగ్ వస్తే…వీకెండ్ లో ఈజీగా 16.18 ని ని టచ్ చేసింది. రియాల్టి షోలలో ఇది చాలా పెద్ద రేటింగ్. భారీ రేటింగ్ సాధించడంతో ఇప్పుడు అంద‌రి దృష్టి ఈ క్రేజీ షో పైనే ప‌డింది. 
 
పార్టిసిపెంట్స్‌వి తెలిసిన మొహాలే అయినప్పటికీ మరీ సెలబ్రిటీ రేంజ్ అనిపించుకునేంత కాదు అనేది అందరు వ్యక్త పరుస్తున్న సమాచారం.. కాని ఈ షో డిమాండ్ చేసే లాంగ్ షెడ్యూల్స్ కు పేరున్న వారిని తీసుకురావడం ప్రాక్టికల్ గా సాధ్యం కాదని హింది, తమిళ్, కన్నడ షోలు రుజువు చేసాయి కాబట్టి ఇంత కన్నా ఆశించకూడదు. ఇక న‌వ్వులు, ఏడుపులు ఉంటేనే క‌దా రియాల్టీ షో అనిపించుకునేది అనేది మ‌రో వాద‌న‌. బిగ్‌బాస్ కొత్త‌ద‌నంతో కూడిన‌ టాస్క్‌లు ఇస్తే బాగుండేద‌ని రెగ్యూల‌ర్‌గా వాచ్ చేస్తున్న‌ ఆడియ‌న్స్ మాట‌. 


ప్రస్తుతం నిస్తేజంగా మారుతున్నట్టు కనిపిస్తున్న ఈ టీవీ షో మరింత ప్రజాదరణ పొందాలంటే, ఈ రేటింగ్ ఇలాగే నిలబడాలంటే ఏదో మహత్తు జరిగాల్సిందే. ఏదయితేనేం ఇప్ప‌టి వ‌ర‌కు ఓవ‌రాల్‌గా చూస్తే తార‌క్ షో ఊహించ‌ని రేంజ్‌లో ఇర‌గ‌దీసింద‌నే చెప్పొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: